Haryana Assembly Elections: రోడ్‌షోతో ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్ షురూ
ABN , Publish Date - Sep 20 , 2024 | 05:59 PM
యమునానగర్‌లోని జగాధరి అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ రోడ్‌షో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 11 జిల్లాల్లో 13 ర్యాలీల్లో కేజ్రీవాల్ పాల్గోనున్నారు.
జగాధరి: హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly Elections) ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శుక్రవారంనాడు శ్రీకారం చుట్టారు. యమునానగర్‌లోని జగాధరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 11 జిల్లాల్లో 13 ర్యాలీల్లో కేజ్రీవాల్ పాల్గోనున్నారు. హర్యానాలోని 90 నియోజకవర్గాలకు 'ఆప్' సొంతంగానే పోటీ చేస్తోంది.
సీతమ్మలా నేనూ అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నా
సీఎం పదవికి రాజీనామా చేసి ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా తాను "అగ్నిపరీక్ష'కు సిద్ధమైనట్టు కేజ్రీవాల్ ఇటీవల తన రాజీనామా అనంతరం వ్యాఖ్యానించారు. ''నేను అగ్నిపరీక్షకు సిద్ధమయ్యాను. రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం ముగించుకున్నప్పుడు సీతమ్మ తల్లి అగ్నిపరీక్షను ఎదుర్కొంది. అలాంటి పరీక్షనే ఇవాళ నేను ఎదుర్కొంటున్నాను. కేజ్రీవాల్ నిజాయితీపరుడు కాదని ప్రజలు అనుకుంటే నాకు ఓటు వేయవద్దు. కానీ నేను నిజాతీపరుడని విశ్వసిస్తేనే ఓటు వేయండి. ఢిల్లీ ప్రజలు తిరిగి ఎన్నుకున్నప్పడే సీఎం పదవి చేపడతాను'' అని కేజ్రీవాల్ తెలిపారు.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ను గెలిపించకుంటే..
హర్యానా ప్రచారం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డబ్‌వాలీ, రానియా, భివాని, మెహమ్, పుండ్రి, రేవారి, దాద్రి, అస్సాంథ్, బల్లడ్‌గఢ్, బద్ర నియోజకవర్గాల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. కీలక నగరాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రధానంగా స్థానిక అంశాలపై ప్రసంగించనున్నారు. హర్యానాలో కాంగ్రెస్‌తో సీట్ల షేరింగ్ వ్యవహారంలో అవగాహన కుదరకపోవడంతో ఆప్ సొంతంగానే ఎన్నికల బరిలోకి దిగుతోంది.
Read MoreNational News and Latest Telugu News
Also Read:CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌కు వరద పోటు.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత