J-K Assembly Elections: సోమవారం రెండు ప్రచార ర్యాలీల్లో రాహుల్
ABN , Publish Date - Sep 22 , 2024 | 09:31 PM
లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారంనాడు రెండు ర్యాలీల్లో పాల్గొంటారు. కాంగ్రెస్, కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం సాగిస్తారు.
శ్రీనగర్: లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (Jammu and Kashmir Elections) ప్రచారంలో భాగంగా సోమవారంనాడు రెండు ర్యాలీల్లో పాల్గొంటారు. కాంగ్రెస్, కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం సాగిస్తారు.
J-K Assembly Elections: బీజేపీ 'హంగ్' ప్లాన్ తిప్పికొట్టేందుకే కాంగ్రెస్‌తో పొత్తు
షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ సోమవారం మధ్యాహ్నం 11 గంటలకు పూంచ్‌లోని సురాన్‌కోతెకు చేరుకుంటారు. కాంగ్రెస్ అభ్యర్థి షానవాజ్ చౌదరికి మద్దతుగా పబ్లిక్ ర్యాలీలో పాల్గొంటారు. షానవాజ్ చౌదరి ఏఐసీసీ కార్యదర్శిగా, ఒడిశా కో-ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థిగా షానవాజ్ ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా, రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా శ్రీనగర్‌లోని సురాన్ కోటలోనూ సోమవారం పర్యటిస్తారు. షాల్టెంగ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలోనూ పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన సభాస్థలికి చేరుకుంటారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత ఎన్నికల్లోనూ బనిహాల్‌లోని సంగల్దాన్, సౌత్ కశ్మీర్‌లోని దూరు ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ పాల్గొన్నారు. రెండో విడత పోలింగ్‌కు సోమవారంతో ముగియనుంది. 25న పోలింగ్ జరుగుతుంది.
Read More National News and Latest Telugu News
Narendra Modi: గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన