Home » Assembly elections
ఏళ్ల తరబడి జమ్మూకశ్మీర్‌లో పాలన సాగించిన కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌పై నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో కేంద్రం గణనీయంగా తీసుకువచ్చిన మార్పులను ప్రస్తావించారు. సంపన్న జమ్మూకశ్మీర్‌కు తాను గ్యారెంటీ ఇస్తున్నానని చెప్పారు.
గత ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేశామని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు వెల్లడిస్తారన్నారు. 75 శాతం కంటే తక్కువ మంది ప్రజలు అలా కాదని సమాధానమిస్తే.. తాను లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న నయా కాశ్మీర్ కోసం తాను పోరాటం చేస్తానని జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ సభ్యుడు షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని తీహాడ్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.
రాజకీయాల్లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తాను పాటుపడతానని వినేశ్ ఫోగట్ తెలిపారు.
అఫ్జల్ గురు సోదరుడు అజాజ్ అహ్మద్ గురు 2014లో పశుసంవర్ధక శాఖ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు.
ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇచ్చే సంప్రదాయం అనాదిగా వస్తోందని ఆయన చెప్పారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మరోసారి అధికారాన్ని అందుకొనేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచీ వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసి.. వారిని సైతం బరిలో నిలుపుతుంది.
ఇంజనీర్ రషీద్‌ను టెర్రర్ ఫండింగ్ కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2017లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. 2019 నుంచి ఆయన తీహార్ జైలులో ఉంటున్నారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తు చర్చలు విఫలం కావడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.
వచ్చే నెలలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.