Jammu Kashmir Assembly Elections: అలా కాకుంటే గవర్నర్ పదవికి రాజీనామా చేస్తా..!
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:53 PM
గత ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేశామని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు వెల్లడిస్తారన్నారు. 75 శాతం కంటే తక్కువ మంది ప్రజలు అలా కాదని సమాధానమిస్తే.. తాను లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు.
శ్రీనగర్, సెప్టెంబర్ 12: గత ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం కృషి చేశామని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు వెల్లడిస్తారన్నారు. 75 శాతం కంటే తక్కువ మంది ప్రజలు అలా కాదని సమాధానమిస్తే.. తాను లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు. 2019లో ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. దీనిపై ప్రజల మనోభావాల తెలుసుకోనేందుకు సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. గురువారం శ్రీనగర్‌లో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడారు.
Also Read: RG Kar Medical College: ప్రొ. సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ సోదాలు
ఆర్టికల్ 370 రద్దుపై సీక్రెట్ బ్యాలెట్ నిర్వహిస్తే.. ప్రజల మనోభావాలు ఏమిటనేది తెలుస్తుందన్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల బనిహల్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గతంలో రాజులకు, లెఫ్టినెంట్ గవర్నర్ పని తీరును పోల్చుతూ విమర్శలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఎల్ జీ అని ఓ రాజు ఉంటారు. ఆయన ఇక్కడి సంపదను బయట వాళ్లకు ఇస్తారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ మనోజ్ సిన్హా పైవిధంగా స్పందించారు.
Also Read: karnataka: మాండ్యలో మత ఘర్షణలు: 52 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ ఎన్నికల అనంతరం ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనా.. దానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా గవర్నర్ ప్రకటించారు. లెఫ్టినెంట్ గవర్నర్లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు కేంద్రం ఆలోచన చేస్తుందనే అంశంపై సైతం ఆయన స్పందించారు. కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లకు కొన్ని అధికారాలుంటాయన్నారు. ఆ క్రమంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా.. తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల వేళ.. జమ్మూ కశ్మీర్‌లోని పోలింగ్ కేంద్రాలకు రికార్డు స్థాయిలో ప్రజలు పోటెత్తిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 58.46 శాతం ఓటింగ్ నమోదు అయిందని తెలిపారు. గత 35 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల్లోనే ఇది రికార్డు అని కేంద్ర ఎన్నికల సంఘం సైతం చెప్పిందన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై జమ్మూ కశ్మీర్ ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.
Read More National News and Latest Telugu New