Share News

Jammu Kashmir Elections: ఎన్నికల ప్రచారం కోసం ఎంపీకి తాత్కాలిక బెయిల్

ABN , Publish Date - Sep 10 , 2024 | 04:55 PM

ఇంజనీర్ రషీద్‌ను టెర్రర్ ఫండింగ్ కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2017లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. 2019 నుంచి ఆయన తీహార్ జైలులో ఉంటున్నారు.

Jammu Kashmir Elections: ఎన్నికల ప్రచారం కోసం ఎంపీకి తాత్కాలిక బెయిల్

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని బారామల్లా (Baramulla) నియోజకవర్గం ఎంపీ షేక్ రహీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌ (Engineer Rashid)కు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మంగళవారంనాడు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం అక్టోబర్ 2వ తేదీ వరకూ ఆయనకు బెయిల్ ఇచ్చింది. గడువు పూర్తి కాగానే ఆయన ఎన్ఐఏ ముందు లొంగిపోవాల్సి ఉంటుంది.

Sushilkumar Shinde: అప్పట్లో కశ్మీర్‌‌ పర్యటన భయమేసింది... కేంద్ర మాజీ హోం మంత్రి షిండే వెల్లడి


రషీద్‌ను టెర్రర్ ఫండింగ్ కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2017లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. 2019 నుంచి ఆయన తీహార్ జైలులో ఉంటున్నారు. కశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలు, వేర్పాటువాదులకు ఉగ్రనిధులు అందజేశారన్న ఆరోపణలపై కశ్మీర్ వ్యాపారి జహూర్ వతలిని అరెస్టు చేసి విచారణ జరిపినప్పుడు రషీద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేద యాసిన్ మాలిక్, లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సైయద్ సలాహుద్దీన్ సహా పలువురి పేర్లను ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. కాగా, రషీద్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఓడించారు.


Read More National News and Latest Telugu News Click Here

Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 10 , 2024 | 05:00 PM