Home » Assembly elections
దేశ నూరవ స్వాతంత్ర్య దినోత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో యావద్దేశం ముందుకు వెళ్తున్న తరుణంలో జార్ఖాండ్ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీ గుర్తుచేశారు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే అభివృద్ధి రెట్టింపు అవుతుందని చెప్పారు.
జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘట్‌శిలాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, బంగ్లాదేశీయుల వలసలతో రాష్ట్రంలో ఆదివాసీల జనాభా గణనీయంగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో హేమంత్ సోనెర్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు.
షైని ఎన్సీపై అనుచిత వ్యాఖ్యల వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఉద్దేశపూర్వకంగానే కొందరు తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వయసు వివాదాంశం అయింది. ఐదేళ్లలో ఏడేళ్లు పెరిగాడంటూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
బహిరంగంగా తనకు మద్దతు తెలిపిన పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్‌కు నవాబ్ మాలిక్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రుణం తీర్చుకోలేనని అన్నారు. జైలు భయంతో తాను అజిత్ పవార్‌తో కలవలేదని, జైలుకు వెళ్లేందుకు తాను ఎప్పుడూ భయపడలేదని చెప్పారు.
'ఇంపోర్ట్ మాల్' అంటూ సావంత్ మాట్లాడటంపై షైన ఎన్సీ అభ్యంతరం తెలిపారు. మహిళల గౌరవంపై జరుపుతున్న దాడిగా దీనిని పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశించారు. గతంలో సావంత్ తనను కూడా ప్రచారం కోసం తీసుకువెళ్లారని గుర్తుచేశారు.
సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారుడి ఇంట్లో సీఎం చంద్రబాబు టీ పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
2019 నామినేషన్లో ఆయన తన వయస్సును 42 ఏళ్లుగా చెప్పుకోగా, ఈ ఏడాది దాఖలు చేసిన అఫిడవిట్లో 49 ఏళ్లుగా డిక్లేర్ చేయడం పలు ప్రశ్నలకు , విమర్శలకు దారితీసింది. దీనిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెస్ట్ మహారాష్ట్ర, విదర్బ, ముంబై-కొంకణ్, నార్త్ మహారాష్ట్ర, మరాఠ్వాడాల్లో 8 పబ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొంటారు. ఎక్కువ పబ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొనే బాధ్యత దేవేంద్ర ఫడ్నవిస్, నితిన్ గడ్కరి, చంద్రశేఖర్ బవాంకులేకి అప్పగించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం అంటే నిన్నటితో ముగిసింది. బుధవారం అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు. ఇక అభ్యర్థుల నామినేషన్ల ఉప సంహరించుకునే గడువు నవంబర్ 4వ తేదీ సాయంత్రంతో ముగియనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో.. నవంబర్ 20వ తేదీన జరగనుంది.