Share News

Devendra Fadnavis: కాషాయం రంగు, దేవుడంటే ఖర్గే కాంగ్రెస్‌కు పడదు

ABN , Publish Date - Nov 11 , 2024 | 03:46 PM

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చాలా దయనీయంగా ఉందని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు ఆ పార్టీని ఎవరూ నమ్మరని చెప్పారు. గతంలోనూ కాంగ్రెస్ వాగ్దానాలు చేయడమే కానీ అమలులో మాత్రం విపలమైందన్నారు. నాగపూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు తనను ఆరోసారి గెలిచిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Devendra Fadnavis: కాషాయం రంగు, దేవుడంటే ఖర్గే కాంగ్రెస్‌కు పడదు

నాగపూర్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు కానీ, ఆ పార్టీ అధ్యక్షుడికి కానీ కాషాయం రంగు అండే పడదని అన్నారు. శతాధిక వత్సరాల ఆ పార్టీ దేవుడికి కూడా వ్యతిరేకమని చెప్పారు.

PM Modi: యువతతోనే వికసిత భారత్ కలల సాకారం: మోదీ


మల్లికార్జున్ ఖర్గే ఆదివారంనాడు జరిగిన 'సంవిధాన్ బచావో సమ్మేళన్'లో యోగి ఆదిత్యనాథ్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, సాధువులమని చెప్పుకునే చాలామంది ఇప్పడు రాజకీయనాయకులుగా మారుతున్నారని, ముఖ్యమంత్రులు కూడా అవుతున్నారని అన్నారు. గోరఖ్‌నాథ్ మఠానికి ప్రధాన అర్చకుడిగా కూడా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.


సనాతన కాషాయం..

ఖర్గే వ్యాఖ్యలపై నాగపూర్ సౌత్ వెస్ట్‌లో రోడ్‌షో సందర్భంగా ఫడ్నవిస్ స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీకి కాషాయం అంటేనే నచ్చదని, అయితే ఇది సఫ్రాన్ సనాతన్, సఫ్రాన్ ఇండియా, సఫ్రాన్ హిందుత్వ అని, దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చాలా దయనీయంగా ఉందని, ఆ పార్టీని ఎవరూ నమ్మరని చెప్పారు. గతంలోనూ కాంగ్రెస్ వాగ్దానాలు చేయడమే కానీ అమలులో మాత్రం విపలమైందన్నారు. నాగపూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు తనను ఆరోసారి గెలిచిపేందుకు సిద్ధంగా ఉన్నారని, తాను, తన కుటుంబం చేసిన పనులను వారెవరూ మరిచిపోలేదని చెప్పారు.


ఒవైసీది రజాకార్ల వారసత్వం..

ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఫడ్నవిస్ మాట్లాడుతూ, తల్లీచెల్లెళ్ల గౌరవాన్ని లూటీ చేసిన రజాకార్ల వారసత్వాన్ని ఒవైసీ కొనసాగిస్తున్నారని అన్నారు. ఆయన నుంచి తాము నేర్చుకునేది లేదని, ఆయనకున్న నాలెజ్డ్ అంతంతమాత్రమేనని అన్నారు. దేశంలోని 52 శాతం పెట్టుబడులు మహారాష్ట్రలో ఉన్నాయని, హైదరాబాద్‌లో కాదని గుర్తుచేశారు. ఆర్థిక వాస్తవాలను ఒవైసీ గుర్తెరగాలని హితవు పలికారు.


ఇవి కూడా చదవండి..

Yamuna River Pollution: కాలుష్య విషనురుగు కక్కిన యుమున నది ... ఆందోళనలో ప్రజలు

Justice sanjiv Khanna: సంచలన తీర్పులకు కేరాఫ్.. సుప్రీం కొత్త సీజేఐ ట్రాక్ రికార్డ్ ఇదీ

For National news And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 03:48 PM