సీఎం కుర్చీ ఎందుకు లాగేసుకున్నారంటే..
ABN , Publish Date - Nov 11 , 2024 | 05:37 PM
కాంగ్రెస్ నేత అలంఘీర్ అలమ్ ఇంట్లో రూ.30 కోట్లకు పైగా పట్టుబడిన విషయాన్ని అమిత్‌షా ప్రస్తావిస్తూ, 27 కౌంటింగ్ మిషన్లతో పట్టుబడిన సొమ్మును లెక్కించారని, ఈ డబ్బంతా ఎక్కడదని ప్రశ్నించారు. ఇదంతా జార్ఖాండ్ ప్రజలకు మోదీ పంపిన సొమ్మని, దానిని హేమంత్ సోరెన్ ప్రభుత్వం హస్తగతం చేసుకుందని చెప్పారు.
సరైకెలా: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల(Jharkhand Assembly Elections) ప్రచారంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) విరుచుకుపడ్డారు. జేఎంఎంకు ఏళ్ల తరబడి విధేయుడిగా ఉన్న చంపయి సోరెన్‌ను అవమానించి సీఎం పీఠం నుంచి దింపేశారని, ఇది ఆయనకు మాత్రమే జరిగిన అవమానం కాదని, గిరిజనులందరికీ జరిగిన అవమానమని అన్నారు. సరైకెలాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారసభలో అమిత్‌షా మాట్లాడుతూ, హేమంత్ సోరెన్‌కు బాసటగా ఏళ్ల తరబడి జేఎఎంకు చంపయి సోరెన్ పనిచేశారని, అవినీతిని ఆపేయమని ఆయన చెప్పిన మాటలు జేఎంఎంకు నచ్చకపోవడంతోనే ఆయనను సీఎం పదవి నుంచి దించేశారని చెప్పారు. చొరబాటుదార్ల సమస్యను చంపయి సోరెన్ ప్రశ్నిస్తే ఆయనను గద్దె దిగిపొమ్మారని వివరించారు.
Devendra Fadnavis: కాషాయం రంగు, దేవుడంటే ఖర్గే కాంగ్రెస్‌కు పడదు
కాంగ్రెస్ నేత అలంఘీర్ అలమ్ ఇంట్లో రూ.30 కోట్లకు పైగా పట్టుబడిన విషయాన్ని అమిత్‌షా ప్రస్తావిస్తూ, 27 కౌంటింగ్ మిషన్లతో పట్టుబడిన సొమ్మును లెక్కించారని, ఈ డబ్బంతా ఎక్కడదని ప్రశ్నించారు. ఇదంతా జార్ఖాండ్ ప్రజలకు మోదీ పంపిన సొమ్మని, దానిని హేమంత్ సోరెన్ ప్రభుత్వం హస్తగతం చేసుకుందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ వ్యక్తులందర్నీ కటకటాల వెనక్కి పంపిస్తుందని చెప్పారు.
స్కామ్‌లు వారికి పరిపాటి..
హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖాండ్ ప్రభుత్వానికి కుంభకోణాలు పరిపాటిగా మారిందని అమిత్‌షా ఆరోపించారు. ఎంజీఎన్ఆర్‌జీఏలో రూ.1,000 కోట్ల కుంభకోణానికి వాళ్లు (జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ) పాల్పడ్డారని, రూ.300 కోట్ల భూ కుంభకోణం, రూ.1,000 కోట్ల గనుల కుంభకోణం, వేలాది కోట్ల లిక్కర్ కుంభకోణం చోటుచేసుకున్నాయని చెప్పారు. ఇది కుంభకోణాల ప్రభుత్వమని, ఒకవైపు 'ఇండియా' కూటమి తమ కార్యకర్తలను మిలనీయర్లు చేసేందుకు పనిచేస్తుండగా, మరోవైపు మోదీ మన ఆడపడుచులను ''లక్‌పతి దీదీ''లుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారని అన్నారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో పరీక్షా పత్రాల లీకేజీలకు పాల్పడుతున్న వారిపై కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఆదివాసీల రిజర్వేషన్‌పై..
ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో హామీలిచ్చిందని, అదే జరిగితే ఆదివాసీలు, దళితుల రిజర్వేషన్లను తగ్గించేస్తారని, జార్ఖాండ్ ప్రజలు దీనిని అంగీకరిస్తారా అని అమిత్‌షా ప్రశ్నించారు. అయితే ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన తరగతుల వారికి తాము భరోసా నిలుస్తామని, ఎవరూ ఆందోళన పడాల్సిన పనేమీ లేదని అన్నారు. వారికి కేటాయించిన రిజర్వేషన్ల జోలికి ఎవర్నీ వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జార్ఖాండ్‌లో చొరబాటుదారులు పెరగడంతో ఆదివాసీల జనాభా తగ్గిపోతోందని, బీజేపీ అధికారంలోకి వస్తే చొరబాట్లను పూర్తిగా అరికడతామని, చొరబాటుదారులు గిరిజన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల ఆస్తి అతని పేరును బదిలీ కాకుండా చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. కాగా, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా ఈనెల 13, 20 తేదీల్లో జరుగనుంది. నవంబర్ 23 ఫలితాలు వెలువడతాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 సీట్లు, బీజేపీ 25 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Yamuna River Pollution: కాలుష్య విషనురుగు కక్కిన యుమున నది ... ఆందోళనలో ప్రజలు
Justice sanjiv Khanna: సంచలన తీర్పులకు కేరాఫ్.. సుప్రీం కొత్త సీజేఐ ట్రాక్ రికార్డ్ ఇదీ
For National news And Telugu News