Share News

Viral Video: ప్రధాని బ్యాగ్ కూడా ఇలాగే తనిఖీ చేస్తారా? ఈసీ అధికారులతో ఉద్ధవ్ వాగ్వాదం

ABN , Publish Date - Nov 11 , 2024 | 08:57 PM

బ్యాగ్ తనిఖీకి ఈసీ అధికారులు రావడంతో థాకరే ప్రశ్నలు కురిపించడం వీడియోలో కనిపిస్తోంది. ముందు తమను తాము పరిచయం చేసుకోమని థాకరే వారిని అడగంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బ్యాగ్‌లు ఇలాగే చెక్ చేస్తారా? అంటూ అధికారులను ప్రశ్నించారు.

Viral Video: ప్రధాని బ్యాగ్ కూడా ఇలాగే తనిఖీ చేస్తారా? ఈసీ అధికారులతో ఉద్ధవ్ వాగ్వాదం

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే, చీఫ్ ఎలక్షన్ కమిషన్ (ఈసీఐ) అధికారుల మధ్య సోమవారంనాడు వాగ్వాదం చోటుచేసుకుంది. పబ్లిక్ ర్యాలీకి హాజరయ్యేందుకు యవత్మాల్‌కు థాకరే వచ్చారు. వెంటనే ఈసీ అధికారులు ఆయన బ్యాగ్ తనిఖీ చేయాలని పట్టుబట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో వైరల్ అవుతోంది.

Devendra Fadnavis: కాషాయం రంగు, దేవుడంటే ఖర్గే కాంగ్రెస్‌కు పడదు


బ్యాగ్ తనిఖీకి ఈసీ అధికారులు రావడంతో థాకరే ప్రశ్నలు కురిపించడం వీడియోలో కనిపిస్తోంది. ముందు తమను తాము పరిచయం చేసుకోమని థాకరే వారిని అడగంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బ్యాగ్‌లు ఇలాగే చెక్ చేస్తారా? అంటూ అధికారులను ప్రశ్నించారు. మహాయుతి నేతల బ్యాగ్‌లు చేసినట్టు వీడియో ఫ్రూవ్ ఉంటే చూపించాలని కూడా ఆయన అధికారులను డిమాండ్ చేశారు. తన బ్యాగ్‌లు తనిఖీ చేసేందుకు అనుమతిస్తానని, ఇందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని, అయితే ప్రధానితో సహా ఇతర రాజకీయ నేతల విషయంలోనూ ఇలాంటి ట్రీట్‌మెంట్‌నే తాను ఆశిస్తానని చెప్పారు.


మీ పాకెట్లు చెక్ చేస్తే, వాళ్ల ప్యాకెట్లూ చెక్ చేయాల్సిందే

బ్యాగ్ తనిఖీ అంశాన్ని ఉద్ధవ్ థాకరే ఎన్నికల ర్యాలీలోనూ లెవనెత్తారు. తన బ్యాగ్ చెక్ చేసినట్టే అధికార మహాయుతి నేతల బ్యాగ్‌లు కూడా చెక్ చేయాలన్నారు. ప్రచారం కోసం వచ్చినప్పుడు నా బ్యాగ్‌ను పలువురు అధికారులు చెక్ చేశారని, వారిని అందుకు అనుమతించానని చెప్పారు. నేను వారిపై కూడా వీడియో చేశాను. ఇప్పట్నించి, ఎవరి బ్యాగ్‌నైనా చెక్ చేస్తే, అధికారి ఐడెంటిటీ కార్డును కూడా తనిఖీ చేసి, అతని పోస్ట్ ఏమిటో కూడా తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. "మీ జేబులు వాళ్లు తనిఖీ చేస్తే, వాళ్ల జేబులు మీరు కూడా తనిఖీ చేయాలి. అది మీ హక్కు. దర్యాప్తు అధికారి మిమ్మల్ని ఆపితే, వారి జేబులు మీరు కూడా తనిఖీ చేయండి. నా బ్యాగ్ తనిఖీ చేసిన అధికారులపై నాకు కోపమేమీ లేదు'' అని థాకరే తన ఎన్నికల ప్రసగంలో వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

Yamuna River Pollution: కాలుష్య విషనురుగు కక్కిన యుమున నది ... ఆందోళనలో ప్రజలు

Justice sanjiv Khanna: సంచలన తీర్పులకు కేరాఫ్.. సుప్రీం కొత్త సీజేఐ ట్రాక్ రికార్డ్ ఇదీ

For National news And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 08:59 PM