Home » AV Ranganath
హైడ్రా.. నాన్ స్టాప్గా దూసుకెళ్తోంది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా పరిగెడుతోంది.. ఎప్పుడొచ్చి బుల్డోజర్ ఇళ్లపై పడుతుందో అని కబ్జాదారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ఎవరైనా సరే చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలితే చాలు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేసిన హైడ్రా.. తాజాగా..
భాగ్యనగరంలో కుచించుకుపోయిన జలవనరులతోపాటు, ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడమే ధ్యేయంగా హైడ్రా ముందుకుసాగుతోంది.
హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించినా.. అక్రమ వసూళ్లకు పాల్పడినా జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ నాడెం చెరువు తూమును శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి నీటిని కిందికి వదిలిపెట్టారు.
చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కార్యాచరణలో దూకుడు మరింత పెరిగింది.
హైదరాబాద్, ఆగష్టు 31: హైడ్రా అనే పేరు వినపడితే చాలు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టేస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పుడు వస్తారో.. ఎక్కడ కూల్చి వేతలు జరుగుతాయో అని భయాందోళనతో ఉన్నారు. ఇప్పటికే అనేక అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా..
వరుస ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఫిర్యాదూ ప్రత్యేకమే అని అలసత్వం వద్దు అన్ని అంశాలు పరిశీలించాలని సూచించారు.
జన్వాడ అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్రెడ్డి ఎందుకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
హైడ్రా కూల్చివేతలపై కొద్దిరోజులుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు తాము వ్యతిరేకం కాదని.. ముందు తన ఇంటి నుంచి మొదలు పెట్టాలంటూ బీఆర్స్ నేతలు..
చెరువు ఎఫ్టీఎల్లో సుందరీకరణ పనులా? ఇరిగేషన్ అధికారులు ఎలా అనుమతించారు? ప్రభుత్వ విభాగాలే ఇలా నిర్మాణాలు చేపడుతాయా? అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్మయం వ్యక్తం చేశారు.