Share News

Ranganath: అయప్ప పొసైటీలో భవనాలు ఎందుకు కూల్చివేశామంటే.. రంగనాథ్ క్లారిటీ

ABN , Publish Date - Jan 05 , 2025 | 07:48 PM

Ranganath: అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్‌లో రెస్టారెంట్లు, హాస్టల్స్ ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వేలాది మంది స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు ఈ హాస్టల్స్‌లో ఉంటున్నారని అన్నారు. ఈ హాస్టల్స్ వల్ల ప్రతీ రోజూ అయ్యప్ప సొసైటీలో డ్రైనేజ్, సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతుందని చెప్పారు.

Ranganath: అయప్ప పొసైటీలో భవనాలు ఎందుకు కూల్చివేశామంటే.. రంగనాథ్ క్లారిటీ
Ranganath

హైదరాబాద్: మాదాపూర్‌(Madhapur)లోని అయ్యప్ప సొసైటీ (Ayyappa Society)లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని ఇవాళ(ఆదివారం) ఉదయం హైడ్రా (HYDRA) అధికారులు కూల్చివేశారు. అయ్యప్ప సొసైటీలో 684 గ‌జాల‌ స్థలంలో ఐదంతస్తుల భవనాన్ని అక్రమంగా ఓ వ్యక్తి నిర్మించాడు. జీహెచ్‌ఎంసీ నోటీసులు, తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ప‌ట్టించుకోకుండా సెల్లార్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు ఐదంత‌స్తుల బిల్డింగ్‌ను ఓ వ్యక్తి కట్టారు. దీనిపై స్థానికుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందడంతో హైడ్రా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలకు గల కారణాలను వివరించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే బిల్డింగ్ కూల్చేశామని స్పష్టం చేశారు. అక్రమంగా నిర్మించిన ఈ బిల్డింగ్‌ను గతంలో జీహెచ్ఎంసీ పాక్షికంగా కూల్చేసిందని చెప్పారు. హైకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా బిల్డింగ్‌ను ఓ వ్యక్తి నిర్మించారని తెలిపారు. అయ్యప్ప సొసైటీలో చాలావరకు అక్రమ నిర్మాణాలే ఉన్నాయని తేల్చిచెప్పారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.


అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్‌లో రెస్టారెంట్లు, హాస్టల్స్ ఉన్నాయని తెలిపారు. వేలాది మంది స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులు ఈ హాస్టల్స్‌లో ఉంటున్నారని అన్నారు. ఈ హాస్టల్స్ వల్ల ప్రతీ రోజూ అయ్యప్ప సొసైటీలో డ్రైనేజ్, సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతుందని చెప్పారు. ఆయా బిల్డింగ్స్‌కి ఎలాంటి పర్మిషన్లు లేవు, ఫైర్ సేఫ్టీ కూడా లేదని చెప్పారు. అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్, నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్స్‌‌పై జీహెచ్ఎంసీ కమిషనర్‌తో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మీటింగ్ తర్వాత చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: సీఎం రేవంత్ పచ్చి అబ్బద్దాలు మాట్లాడుతున్నారు.. కేటీఆర్ ధ్వజం

Dr. Lakshman: కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వం..: ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

KTR: మోసానికి మారు పేరు కాంగ్రెస్: కేటీఆర్

HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 05 , 2025 | 07:58 PM