Share News

HYDRA: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం..

ABN , Publish Date - Jan 07 , 2025 | 10:01 PM

హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాన హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

HYDRA: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం..
New Hydra Police Station

హైదరాబాద్, జనవరి 07: హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాన హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఎవరైనా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే వారిపై హైడ్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. దాని ఆధారంగా హైడ్రా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వుల్లో ప్రకటించారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారి ఉండనున్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్‌కి కావాల్సిన పోలీస్ సిబ్బందిని కేటాయించాలంటూ రాష్ట్ర డీజీపీకి హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.


హైడ్రాకు గుడ్ న్యూస్..

బ‌తుక‌మ్మకుంటపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. బ‌తుక‌మ్మ కుంట స్థలం త‌మ‌దంటూ ఎడ్ల సుధాక‌ర్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌‌ను హైకోర్టు కొట్టేసింది. ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్‌లో బతుకమ్మ కుంటను.. కుంటగానే గుర్తించింది. బ‌తుక‌మ్మ కుంట చెరువు పున‌రుద్ధర‌ణ‌లో హైడ్రా చ‌ర్యలు స‌క్రమ‌మేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో హైడ్రాకు మరింత జోష్ వచ్చింది. త్వర‌లో చెరువు పున‌రుద్ధర‌ణ‌కు హైడ్రా చ‌ర్యయలు చేపట్టనుంది. 1962 లెక్కల ప్రకారం మొత్తం 14 ఎకరాల 6 గుంటల విస్తీర్ణంలో బ‌తుక‌మ్మ కుంట‌ ఉంది. తాజా స‌ర్వే ప్రకారం అక్కడ 5 ఎకరాల 15 గుంటల భూమి మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వం త‌ర‌ఫున సంబంధిత ప‌త్రాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించి.. అనుకూల‌మైన తీర్పు రావ‌డంలో హైడ్రా కృషి చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా లీగ‌ల్ బృందంతో పాటు, రెవెన్యూ ఉద్యోగుల‌ను కమిషనర్ రంగనాథ్ సన్మానించారు.


Also Read:

బాబోయ్.. మరో రెండు రోజులు చుక్కలేనట..

చిక్కినట్లే చిక్కి.. బాబోయ్ గంజాయి బ్యాచ్..

రాజధాని అమరావతిపై మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు..

For More Telangana News and Telugu News..

Updated Date - Jan 07 , 2025 | 10:02 PM