Home » Ayodhya Prana Prathista
అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఆలయ నిర్మాణంలో భాగమైన కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ కార్మికులపై గులాబీ పూలవర్షం కురిపించారు.
Ayodhya: రామ రాజ్యం అంటే అలా ఉండేది.. ఇలా ఉండేది అని పురాణాల్లో చదివి తెలుసుకోవడమే కానీ.. ప్రత్యక్షంగా చూసిన వారు లేరు. కానీ, ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అవును, అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఏ రాముడి గుడి కోసం అయితే పోరాటం జరిగిందో.. అదే గడ్డంపై ఇప్పుడు మతాలన్నీ వెనక్కి వెళ్లి.. మానవత్వం ఫరిడవిల్లింది. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠను స్వాగతిస్తున్నారు ముస్లిం మత పెద్దలు.
రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయం నిర్మించాలన్న 500 ఏళ్ల నాటి ప్రజల కల నేటికి సాకారమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.1990లో కరసేవకులకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు అయోద్యలో ఎలాంటి కర్ఫ్యూలు, కాల్పులు లేవన్నారు.
అయోధ్య రామ మందిర్(ram mandir) ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బాలరాముడిని చూసి పులకించిపోయినట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా భావోద్వేగంతో తన కళ్ల నుంచి నీరు వచ్చినట్లు చెప్పారు.
అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనతో యావద్దేశం పులకించింది. నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహించిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలతో ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఉపవాస దీక్షను విరమించారు. ప్రధాన అర్చకుల నుంచి పవిత్ర తీర్ధాన్ని స్వీకరించి వారి ఆశీర్వాదాలు పొందారు.
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రధాని మోదీకి పండితులు కండువా వేశారు. పూల దండ వేసి ఆశీర్వదించారు. ఓ పండితుడు బంగారు ఉంగరాన్ని జ్ఞాపికగా అందజేశారు.
అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. బాల రాముడిని చూసేందుకు రెండు కన్నులు చాల లేవు. ప్రధాని మోదీ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తర్వాత బాల రాముని విగ్రహాం ముందు ప్రధాని మోదీ ప్రణమిల్లారు.
నిర్ణయించిన సమయానికే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది.
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత భారత పర్యాటక రంగానికి మరింత ఊపు వస్తుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. ఈ క్రమంలో అయోధ్యకు సంవత్సరానికి 5 కోట్ల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు భద్రాచలం ఆలయ నిర్వాహకులను ఆహ్వానించ లేదని మండిపడ్డారు.