Share News

Congress Leader VH: భద్రాచలం ఆలయానికి ఆహ్వానం అందలేదు.. వీహెచ్ విసుర్లు

ABN , Publish Date - Jan 22 , 2024 | 01:45 PM

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు భద్రాచలం ఆలయ నిర్వాహకులను ఆహ్వానించ లేదని మండిపడ్డారు.

 Congress Leader VH: భద్రాచలం ఆలయానికి ఆహ్వానం అందలేదు.. వీహెచ్ విసుర్లు

భద్రాద్రి కొత్తగూడెం: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం గురించి కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు (VH) సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు భద్రాచలం ఆలయ నిర్వాహకులను ఆహ్వానించలేదని మండిపడ్డారు. భద్రాద్రి రాములోరి ఆలయంపై వివక్ష ఎందుకు చూపారో అర్థం కావడం లేదన్నారు. దేవుని వద్ద రాజకీయాలు తగవని ఆయన సూచించారు. అయోధ్య తర్వాత అంతటి చరిత్ర కలిగిన దేవస్థానం భద్రాచలం అని వీహెచ్ గుర్తుచేశారు. భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తారని వెల్లడించారు. అలాంటి స్వామివారిని అయోధ్య ఆలయ ట్రస్ట్ సభ్యులు మరచిపోవడం సరికాదన్నారు.

భద్రాద్రి ఆలయానికి ఆహ్వానం రాకపోవడానికి కారణం ఉందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని వీహెచ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతోనే భద్రాద్రి రాములోరికి ఆహ్వానం అందలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రస్ట్ సభ్యులు కావాలనే ఆహ్వానించలేదని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సూచనల మేరకే ట్రస్ట్ సభ్యులు అతిథులను ఆహ్వానించారని పేర్కొన్నారు. భద్రాద్రి రాములోరిని అయోధ్య ట్రస్ట్ సభ్యులు పిలవలేదని వీహెచ్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 22 , 2024 | 01:54 PM