Home » Ayodhya Prana Prathista
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. రామనామ స్మరణతో దేశం మార్మోగిపోతోంది. ఇతర దేశాల్లోనూ రామ ప్రతిష్ఠ సంబురాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దర్యా గంజ్‌లో గల శ్రీ సనాతన్ ధర్మ్ మందిర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రార్థనలు చేశారు.
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం విదేశాల్లో ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్దకు ప్రవాస భారతీయులు భారీగా చేరుకున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపనకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రామాలయంలో హారతి సందర్భంగా ఆర్మీ హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు.
అయోధ్య రామ మందిర్ రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ క్రమంలోనే అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gowtham Adani) ఎక్స్(X)లో ఆసక్తికర పోస్ట్ చేశారు. దేశంలో మత సామరస్యానికి ఈ ఆలయం నిదర్శనంగా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Ayodhya Ram Mandir Inauguration Live Upates: 500 ఏళ్ల కల నేటితో సాకారం కానుంది. మరికొద్ది సేపట్లో అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ అద్భుత, అరుదైన దృశ్యాలను చూసేందుకు, శ్రీరాముడి ఆశీస్సులు పొందేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు సహా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులతో పాటు దేశ నలుమూలల నుంచి భక్త జనులు అయోధ్యకు తరలి వచ్చారు.
‘రామాయణం’ హిందీ సీరియల్‌లో నటించిన నటీనటులు అయోధ్యలో కనిపించారు . 1987-88లో రామాయణం సీరియల్ దూరదర్శన్‌లో టెలికాస్ట్ అయ్యింది. ఆ సీరియల్ అప్పట్లో విశేష జనాధరణ పొందింది.
అయోధ్య (Ayodhya)లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠకు సమయం ఆసన్నమవుతున్న వేళ అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి 7 వేల మంది ప్రముఖులు వస్తారని అంచనా వేస్తున్నారు. వీవీఐపీలు, వీఐపీలు రానుండటంతో సీఆర్పీఎఫ్(CRPF) దళాలు, ఏటీఎస్ కమాండోలు, యాంటీ డ్రోన్ జామర్లు, ఎస్‌పీజీ దళాలు రంగంలోకి దిగాయి. అయోధ్య నగర అణువణువును వారు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
భారతావని రామ నామ స్మరణతో మార్మోగుతోంది. అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సమక్షంలో జరగనుంది. ఈ సందర్భంగా దేశంలోని అనేక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయోధ్యతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో చారిత్రక నేపథ్యం కలిగిన రామాలయాలు(Ram Mandir) ఉన్నాయి.
ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు మరికాసేపట్లో తెరపడనుంది. ఎంతో కాలంగా కంటున్న కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్య పుణ్య క్షేత్రంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధమైంది. వేలాది మంది అతిథుల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్ లగ్న ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభంకానుంది.