Home » Ayodhya Ram mandir
రామభక్తుల శతాబ్దాల కల సాకారమై అయోధ్యలోని భవ్య మందిరంలో సోమవారంనాడు కొలువైన రామ్‌లల్లాను ఇక నుంచి "బాలక్ రామ్''గా పిలువనున్నారు. ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన ట్రస్టు పూజారి అరుణ్ దీక్షిత్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అందరి అంచనాలూ నిజం చేస్తూ తొలి రోజున అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇప్పటివరకూ సుమారు మూడు లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శనం చేసుకున్నారు.
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో ప్రధాని మోదీ రామ్ లల్లా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. ఆ రాములోరికి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బహుమతులను అందజేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి వజ్రాలు పొదిగిన కిరీటాన్ని బహూకరించారు.
గౌతం గంభీర్. ఈ పేరు వినగానే టీమిండియాకు గంభీర్ అందించిన రెండు ప్రపంచకప్‌లతోపాటు ఆయన అగ్రెసివ్ ప్రవర్తన కూడా గుర్తుకొస్తుంది. తన ఆటతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో వివాదాలను కూడా సంపాదించుకున్నాడు.
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజున బిడ్డలు జన్మించిన ఇళ్లల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఆ రామచంద్రుడి ప్రసాదం అని పలువురు సంతోషం వెలిబుచ్చారు.
అయోధ్య బాలరాముడుకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. రూ.2.50 కోట్ల నగదును రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేస్తామని వెల్లడించింది.
లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అయోధ్య ఎపిసోడ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ ఉంది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లను వేయడం జరిగింది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టిసారించింది. గతంలో కన్నా ఎక్కువ లోక్ సభ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. అయోధ్య రాముడిని అస్త్రంగా మార్చుకోబోతుంది. తెలంగాణ నుంచి అయోధ్యకు నడిచే రైళ్లలో భక్తుల తరలించనుంది.
అయోధ్యలో బాలరాముడిని దర్శించుకునేందుకు మంగళవారం నాడు భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి అధిక సంఖ్యలో వచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో తోపులాట జరిగింది.