Home » Ayodhya Ram mandir
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, సినీ, క్రీడా ప్రముఖులు హాజరవుతారు. విదేశాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు.
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ(Ram Mandir) కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరు కాబోదనే అధిష్టాన నిర్ణయంపై ఆ పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా గుజరాత్‌కి చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా(MLA Resign) చేశారు. విజాపూర్ నియోజకవర్గం నుంచి సీజే చావ్డా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
శ్రీరాముడి జీవిత చరిత్రను వాల్మీకి ‘రామాయణం’లో రాశారు. లేటెస్ట్ రామాయణ బుక్ అందుబాటులోకి వచ్చింది. ఆ పుస్తకం ధర మాత్రం లక్ష 65 వేల రూపాయలు.
ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యకమానికి హాజరయ్యే టీమిండియా ఆటగాళ్ల జాబితాలో మరో క్రికెటర్ కూడా చేరాడు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఆహ్వానం అందింది.
అయోధ్యలో రామమందిరం ప్రారంభమవుతున్న తరుణంలో ఎన్నో కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. బెంగళూరు నగరం జయనగర్‌కు చెందిన డాక్టర్ శివరాజ్‌కుమార్ శ్రీరాముడికి తులసి సేవ చేయదలచారు.
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో సోమవారం రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించామని హోం మంత్రి పరమేశ్వర్(Home Minister Parameshwar) తెలిపారు.
అయోధ్యలో రామ్ లల్లా (బాల రాముడి) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే 22వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పూట సెలవు ఇస్తున్నామని సిబ్బంది, శిక్షణ విభాగం ప్రకటనలో తెలిపింది. ఆ రోజున కొన్ని రాష్ట్రాలు పూర్తిగా సెలవు ఇవ్వగా మరికొన్ని రాష్ట్రాలు హాఫ్ డే సెలవు ప్రకటించాయి.
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. అదే రోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరగనుంది.
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. వేలాది మంది అతిథులు హాజరవనున్నారు. అయోధ్య ఆలయం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
అయోధ్యలో రామ్ లల్లా (బాలరాముడి) ప్రాణ ప్రతిష్ఠ సోమవారం రోజున జరగనుంది. రామ్ లల్లాకు బహుమతిగా వివిధ ప్రాంతాల నుంచి జ్ఞాపికలు వస్తున్నాయి. బాలరాముడి కోసం 1265 కిలోల లడ్డు ప్రసాదం అయోధ్యకు చేరింది.