Home » Badvel
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బద్వేల్ విద్యార్థి ఘటనలో నిందితుడు విగ్నేష్‌ను కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలను ఆయన వెల్లడించారు. బద్వేల్ పరిధిలోనే మైనర్ బాలికపై పెట్రోల్ పోసి నిందితుడు విగ్నేష్ తగలబెట్టాడని ప్రకటించారు.
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెపండుగతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. కొండూరులో రూ.40 లక్షల ఉపాధి నిధులతో సిమెంటు రోడ్లకు బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బొజ్జా రోశన్న భూమి పూజ నిర్వహించారు.
నర్సాపురం పోస్టాఫీస్‌లో నాయక్ అనే అతను 13 సంవత్సరాలుగా పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో ఇతను పోస్టాఫీసుకు వచ్చేవారితో బాగా పరిచయాలు పెంచుకున్నాడు. ఖాతాదారులు సైతం ఇతనిపై నమ్మకం పెంచుకున్నారు.
బద్వేలు పట్టణం నానాటికి విస్తరిస్తోంది. చుట్టూ గ్రామీణ ప్రాంత ప్రజలు తమ పిల్లల చదువుల కోసం, వృత్తి, వ్యాపారాల రీత్యా బద్వేలు పట్టణానికి వచ్చి నివాసం ఉంటున్నారు. దీంతో స్థలాల ధరలకు రెక్కలు వచ్చి డీకేటీ భూములు కూడా లక్షల రూపాయలు పలుకుతున్నాయి.
కడప: బద్వేల్లో విద్యార్థిని అనూష మృతి కేసులో గురుమహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.