కడప: బద్వేల్‌లో అనూష మృతి కేసులో గురుమహేశ్వరరెడ్డి అరెస్ట్
ABN , First Publish Date - 2022-10-25T14:17:32+05:30 IST
కడప: బద్వేల్‌లో విద్యార్థిని అనూష మృతి కేసులో గురుమహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కడప: బద్వేల్‌లో విద్యార్థిని అనూష మృతి కేసులో గురుమహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అన్బురాజన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాలేజీలో చదివే గురుమహేశ్‌తో అనూషకు పరిచయం ఏర్పడిందని, ఈనెల 19న ఇద్దరు బద్వేల్ నుంచి సిద్ధవటం కోటకు వెళ్లివచ్చారని చెప్పారు. ఇద్దరి మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ జరిగిందని, బర్త్‌డే రోజు సిద్ధవటం కోటకు రావాలని మహేశ్ ఒత్తిడి తేవడంతో 20న అనూష బద్వేల్ నుంచి సిద్ధవటం కోటకు బస్సులో వెళ్లిందన్నారు. మహేష్ బర్త్ డే సందర్బంగా బిర్యాని తీసుకుని 8 కి.మీ. దూరం వెళ్ళారన్నారు. అనూష మృతి సమయంలో మహేశ్, అతని స్నేహితులు పార్టీ చేసుకున్నారని, ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని ఎస్పీ తెలిపారు. లివర్‌లో వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల అనూష చనిపోయిందన్నారు. అయితే ఆమె నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా తోసేశారా? అనేదానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఈ నెల 20న బయటకు వెళ్లిన తన కుమార్తె అనూష కనిపించడంలేదని ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఆదివారం (23వ తేదీ) సిద్దవటం వద్ద పెన్నా నది ఒడ్డున అనూష శవం లభ్యమైంది. సంఘటన స్థలంలోనే ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. శరీరంలో ఎక్కడా ఎటువంటి గాయాలు లేవు. అనూష ప్రియుడు మహేశ్వర్ రెడ్డిపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.