Home » Bandi Sanjay Kumar
తెలంగాణలో అమలవుతున్న స్మార్ట్ సిటీ మిషన్ గడువును కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు పొడిగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. నిజానికి, స్మార్ట్ సిటీ మిషన్ గడువు ఆదివారంతోనే ముగిసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
పార్లమెంటులో తెలుగు భాష పరిమళించింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడింది. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు ఎంపీలు మాతృభాషలో ప్రమాణం చేశారు. మరికొందరు సంప్రదాయ దుస్తుల్లో మెరిసి లోక్‌సభకు వన్నె తెచ్చారు.
నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని, నీట్లో జరిగిన అక్రమాలకు అదే కారణమని ఆయన ఆరోపించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం నటుడు చిరంజీవిని కలిశారు. ఢిల్లీ బయలుదేరే ముందు సంజయ్.. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆయనను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో సత్కరించి.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా..? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
తెలంగాణ బిడ్డగా సింగరేణికి అన్యాయం చేయబోనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు.
రద్దయిన ఐటీఐఆర్‌ను తిరిగి తెప్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపైనే ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. ఆ తర్వాత వచ్చిన మోదీ సర్కారు దాన్ని రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు.
‘‘బీజేపీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు.. 8 మంది ఎమ్మెల్యేలున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 88 స్థానాల్లో విజయం సాధించి, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం’’ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు.
కేంద్ర మంత్రులుగా ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణ నేతలైన కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) నేడు హైదరాబాద్(hyderabad) రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులకు స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది.