Minister Seethakka: కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ.. మంత్రి సీతక్క షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Mar 30 , 2025 | 06:03 PM
Minister Seethakka: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమేనని, అంబానీలకు పేదల సంపదను ప్రధాని దోచిపెట్టారని మంత్రి సీతక్క ఆరోపించారు.

సూర్యాపేట: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేస్తుందని.. 56 లక్షల రేషన్ కార్డులకు కేంద్రమే సన్నబియ్యం ఇస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్రం సన్న బియ్యమిస్తే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని రేవంత్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి సీతక్క స్పందించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన పన్నెండేళ్లలో సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదో కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పాలని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఇవాళ(ఆదివారం) సూర్యాపేటలోని పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని బండి సంజయ్ అన్నారని.. కానీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని మంత్రి సీతక్క నిలదీశారు. కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమేనని, అంబానీలకు పేదల సంపదను ప్రధాని దోచిపెట్టారని ఆరోపించారు. ఇందులో బీజేపీ నాయకులు వాటాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో ఒక రూపాయి పంపిస్తే రూ.48 పైసలే తిరిగి వస్తున్నాయని చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోలు పెడతారా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు.
బీఆర్ఎస్‌లో ఉన్నందుకు ప్రవీణ్ కుమార్ సిగ్గుపడాలి: ఎంపీ మల్లు రవి
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిది రాక్షస పాలన, రాబందుల పరిపాలన అంటారా అని ధ్వజమెత్తారు. ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తని ప్రవీణ్ కుమార్ ఎలా అంటున్నారని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడాలని విమర్శించారు. బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక్షసుడు ,కేసీఆర్ పాలన రాక్షస పాలన అని ప్రవీణ్ కుమార్ అనలేదా అని ఎంపీ మల్లు రవి నిలదీశారు.
మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదని ప్రవీణ్ కుమార్ గతంలో అనలేదా అని ఎంపీ మల్లు రవి నిలదీశారు. మూడు నెలల పాటు కేసీఆర్ తనను కూడా కలవనీయలేదని గతంలో ప్రవీణ్ కుమార్ అన్నాడని గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసమా ఆయన కోసమా చెప్పాలని ప్రశ్నించారు. ఒక దళిత వ్యక్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కీలక మార్పులు తీసుకు వస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం కోసం గొప్ప విప్లవాన్ని తీసుకువస్తున్నారని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
T Jayaprakash Reddy: నా మీద ఎన్నో కుట్రలు జరిగాయి
CM Revanth Reddy: ఉగాది పచ్చడిలా తెలంగాణ బడ్జెట్ షడ్రుచుల సమ్మిళితం: సీఎం రేవంత్ రెడ్డి..
దేశాన్ని విభజింటే కుట్ర.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News and Telugu News

జీవో 29పై సంచలన తీర్పు.. ఇక ఆ ఉద్యోగాలకు లైన్ క్లియర్..

కేటీఆర్‌కు షాకిచ్చిన కాంగ్రెస్ సర్కార్.. లెక్కలు తీస్తోందిగా..

రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

కాసేపట్లో మళ్ళీ భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల వారికి బిగ్ అల్టర్

విజయ డెయిరీ సంచలన నిర్ణయం..
