Share News

Bandi Sanjay: మీ పార్టీ కరోనా కంటే డేంజర్.. రేవంత్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Apr 09 , 2025 | 09:17 PM

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు.

Bandi Sanjay: మీ పార్టీ కరోనా కంటే డేంజర్..  రేవంత్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
Bandi Sanjay Kumar

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణలో రేవంత్ కాలం చెల్లిందని అన్నారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎంపీ గెలిచారు. ఆయన మాజీ పార్లమెంట్ స్థానం మల్కాజ్‌గిరిలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నారు. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఇద్దరిని ఓడించింది కూడా బీజేపీ అనే విషయం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాషాయ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పు రేవంత్‌కు కనువిప్పు కలగాలని అన్నారు. బీజేపీని అడ్డుకుంటామంటూ ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరువయ్యారని చెప్పారు. అంతరించి పోతున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పగటి కలలు కనడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.హైదరాబాద్‌ను మజ్లిస్ చేతిలో పెట్టేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైందని ఆరోపించారు. దేశభక్తి పార్టీని బ్రిటీషర్లతో పోలుస్తావా అని ధ్వజమెత్తారు. కరోనా కంటే ప్రమాదకరమైన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు. మిగిలిన రెండు రాష్ట్రాల్లోనైనా కాంగ్రెస్‌ను కాపాడుకుంటే మంచిదని హితవు పలికారు. ఈ మేరకు బుధవారం నాడు బండి సంజయ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.


ఆ పంచాయతీల పురోగతి భేష్...

సుస్థిర అభివృద్ది సాధనలో భాగంగా ‘‘గ్రామ పంచాయతీ పురోగతి’’లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 6 గ్రామాలు ర్యాంకులు సాధించడం హర్షణీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో 25 గ్రామ పంచాయతీలు ర్యాంకులు సాధిస్తే వాటిలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తిమ్మాపూర్, బండపల్లి(చందుర్తి మండలం), గండ్రపల్లి (జమ్మికుంట మండలం), బల్వంతపూర్ (మల్యాల మండలం), రుద్రంగి, ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీలు మెరుగైన ర్యాంకులు సాధించడం సంతోషదాయకమని బండి సంజయ్ కొనియాడారు.


బండి సంజయ్ అభినందనలు..

ఆయా పంచాయతీల అభివృద్ధిలో కీలకంగా పనిచేసిన నాటి సర్పంచులు, అధికారులకు బండి సంజయ్ అభినందనలు తెలిపారు. ఇతర పంచాయతీలు కూడా సుస్థిర అభివృద్ధి సాధన కోసం కృషి చేయాలని కోరారు. అదే సమయంలో పంచాయతీల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అహర్నిశలు కష్టపడిన మాజీ సర్పంచుల పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చూపడం సహించరానిదని అన్నారు. ప్రజల కోసం అప్పులు చేసి, ఆస్తులమ్మి పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచులకు ఏళ్ల తరబడి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పటికైనా వెంటనే మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ సర్పంచులు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పడం తథ్యమని బండి సంజయ్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్ రద్దు

Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..

Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 09 , 2025 | 10:01 PM