Home » Bandi Sanjay
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతానన్న భయంతో ఇంటెలిజెన్స్ వద్ద ఉన్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేయించారని విమర్శించారు. దేశ భద్రత డేటాను ధ్వంసం చేసిన వ్యక్తిని ఎలా వదలిపెడతారు? ఎందుకు ఆయన్ను జైల్లో వేయలేదు? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు.
Telangana:జిల్లాలో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా భారీ ఎత్తున యువత తలివచ్చారు. అలాగే ర్యాలీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మహా బైక్ ర్యాలీలో బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ముస్లిం జనాభా 43 శాతం పెరిగిందన్నారు. హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్లా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని ఇస్లాం సంస్థలు భారత్‌ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నాయని పేర్కొన్నారు.
‘హిందూ సమాజమంతా నా వెనక ఉంది. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా. కరీంనగర్లో వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్‌ఎ్‌సను మూసివేసి రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా..?’’ అంటూ కేసీఆర్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసపుమాటలు నమ్మవద్దని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ కలుగులో ఎలుక లాంటివాడని.. పెద్ద బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు. కేసీఆర్ ఒక వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా అని విమర్శించారు. కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నాడని.. ఆయనేమైనా సుద్ద పూసా? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ గెలవడం పక్కా అని స్పష్టం చేశారు. వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.
Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానని ప్రధాని మోదీ తెలిపారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. మూడో దశ ఎన్నికల్లో ఇండియా కూటమి మూడో ఫ్యూజ్ పోయిందన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో వేగంగా ముందుకు వెళ్తోందన్నారు. మిగిలిన 4 విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను.. గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారన్నారు.
బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ యూత్ ఐకాన్ అని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ప్రశంసించారు. ప్రధాని మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. సంజయ్ పోరాటాలు ఆదర్శంగా నిలిచాయని,
తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బీజేపీ అగ్ర నేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నేడు మూడు బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లి, ఒంటి గంటకు భువనగిరి, మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ బీజేపీ అభ్యర్థి మద్దతుగా నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు..