Share News

PM Modi: వసూళ్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను మించిపోయిన ఆర్ఆర్ ట్యాక్స్‌..

ABN , Publish Date - May 08 , 2024 | 11:56 AM

తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానని ప్రధాని మోదీ తెలిపారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. మూడో దశ ఎన్నికల్లో ఇండియా కూటమి మూడో ఫ్యూజ్‌ పోయిందన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో వేగంగా ముందుకు వెళ్తోందన్నారు. మిగిలిన 4 విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను.. గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారన్నారు.

PM Modi: వసూళ్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను మించిపోయిన ఆర్ఆర్ ట్యాక్స్‌..

కరీంనగర్‌: తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానని ప్రధాని మోదీ తెలిపారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. మూడో దశ ఎన్నికల్లో ఇండియా కూటమి మూడో ఫ్యూజ్‌ పోయిందన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో వేగంగా ముందుకు వెళ్తోందన్నారు. మిగిలిన 4 విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను.. గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌ విజయం ముందే ఖరారైందన్నారు. కరీంనగర్‌లో ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్‌ బరిలోకి దింపిందన్నారు. ఉదయం10 గంటలకు ఇంత పెద్ద సభ గుజరాత్‌లో కూడా సాధ్యం కాదని మోదీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓటమి కరీంనగర్‌లో ఖాయమైందన్నారు. బీఆర్ఎస్‌ ప్రభావం కరీంనగర్‌లో మచ్చుకైనా కనిపించట్లేదన్నారు.

Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్‌ ఉండాలి


బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే..

మీ ఓటు వల్లే ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థికవ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దా. పదేళ్లలో నా పనితీరు మీరు చూశారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. బీజేపీకి నేషన్‌ ఫస్ట్‌ అయితే.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు ఫ్యామిలీ ఫస్ట్‌. అవి రెండూ ఒక్కటే. ఆ రెండింటినీ అవినీతే కలుపుతోంది. తెలంగాణను కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ల నుంచి కాపాడాలి. వ్యవసాయ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించాం. టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేశాం. రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్నాం. కుటుంబం వల్ల, కుటుంబం చేత, కుటుంబం కోసం.. నినాదంతో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పనిచేస్తున్నాయి. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని రెండు పార్టీలు కాలరాశాయి. మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్‌ పార్టీ అవమానించింది. పీవీ పార్థివదేహాన్ని కాంగ్రెస్‌ తన ఆఫీస్‌లోకి కూడా అనుమతించలేదు. పీవీకి మా ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసింది. పీవీ కుటుంబంలోని రెండు, మూడు తరాలతో సుదీర్ఘంగా మాట్లాడా. పీవీ గొప్పతనాన్ని తెలుసుకున్నా.

Secunderabad: సికింద్రాబాద్‏లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం..


అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్‌ ఎంత తీసుకుంది?

అవినీతి అనేది కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లో కనిపించే ఉమ్మడి లక్షణం. కాంగ్రెస్‌పై ఓటుకు నోటు ఆరోపణలు బీఆర్ఎస్‌ చేసింది. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం స్కాంపై.. చర్యలు తీసుకోవట్లేదు. అవినీతి సిండికేట్‌లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ భాగస్వాములు. ఆర్ఆర్ ట్యాక్స్‌ అంటే తెలంగాణలో ప్రతిఒక్కరికీ తెలుసు. వసూళ్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను ఆర్ఆర్ ట్యాక్స్‌ మించిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా వెయ్యి కోట్లు సాధిస్తే.. ఆర్ఆర్ మాత్రం కొన్ని రోజుల్లోనే వెయ్యి కోట్లు దాటేసింది. ఆర్ఆర్ నుంచి తెలంగాణను విముక్తి చేయాలి. అంబానీ, అదానీని ఇన్నాళ్లు విమర్శించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ఆపేసింది. అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్‌ ఎంత తీసుకుంది? ఈ గుట్టల కొద్దీ డబ్బు గురించి కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి. హైదరాబాద్‌లో ఎంఐఎంను గెలిపించడానికి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు పని చేస్తున్నాయి. కాంగ్రెస్‌ చేస్తున్న రాజకీయాలు ఓబీసీలకు నష్టం. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తోంది. మాదిగలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అడ్డుపడుతోంది.

ఇదికూడా చదవండి: Hyderabad: మోత్కుపల్లి.. కాదు ఉసరవెల్లి!

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2024 | 11:56 AM