Home » Bandi Sanjay
Telangana: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేసీఆర్ లాగా రైతులను మోసం చేయొద్దన్నారు. సిరిసిల్ల జిల్లా రైతులను ఆదుకోవాలన్నారు. అప్పులు చేసి పంటలు వేశారని.. చేతికి వచ్చే సమయానికి వర్షం పాలైందని తెలిపారు. పదేళ్లలో ఒక్క రైతుకు కూడా పంట నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దృష్టి సారించారు. లోక్‌సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (ఆదివారం) ఏపీలో ప్రజాగళం భారీ బహిరంగా సభ తర్వాత హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారు.
నిజాం రాజు చాలా గొప్పోడ పొగుడుతున్న వాళ్లను కట్టేసి"రజాకార్" సినిమా చూపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. నిజాం తరహా పాలన రాకూడదని అనుకునేవాళ్లంతా కచ్చితంగా "రజాకార్" సినిమా చూడాలని చెప్పారు.
Telangana: ప్రజలు ఛీ కొట్టినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల పునాదుల మీద బీఆర్ఎస్ నడుస్తోందన్నారు. ‘‘నీ పార్టీలో తెలంగాణ పదమే లేదు.. ప్రజల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఆంధ్రాలో ఏడు మండలాలను కలిపింది కేసీఆరే.. ఆఫ్ట్రాల్ ఏడు మండలాలు అని కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారు’’ అంటూ మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాముడి పేరుతో బరాబర్ తాము ఓట్లను అడుగుతామని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబర్ పేరు చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం 6 గ్యారంటీలను నాలుగు రోజుల్లో అమలు చేయాల్సిందేనని.. హామీలను అమలు చేయకపోతే వదిలి పెట్టమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. మంత్రుల కేబినెట్ మీటింగ్‌లో 6 గ్యారెంటీలకు ఆమోదం తెలిపి నిధులను విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.
ధరణి పోర్టల్‌ను గత ప్రభుత్వం అనుకూలంగా మార్చుకుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. భూదాన్ భూమి పేరుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భూమిని కొట్టేశారని వివరించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు వచ్చిన కథనం అక్షర సత్యం అని వివరించారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌పై (KCR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మేడిగడ్డనా? బొందలగడ్డనా? ఏం పీకడానికి మేడిగడ్డకు పోతున్నారు’’ అని కేసీఆర్ మాట్లాడారని.. ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం సమంజసమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయం(Telangana Politics) మరింత రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర హుస్నాబాద్‌లో(Busnabad) తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది.