Bandi Sanjay: ఏం సాధించారని ‘కదనభేరీ’ సభను పెడుతున్నారు.. కేటీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
ABN , Publish Date - Mar 10 , 2024 | 05:27 PM
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం 6 గ్యారంటీలను నాలుగు రోజుల్లో అమలు చేయాల్సిందేనని.. హామీలను అమలు చేయకపోతే వదిలి పెట్టమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. మంత్రుల కేబినెట్ మీటింగ్‌లో 6 గ్యారెంటీలకు ఆమోదం తెలిపి నిధులను విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టారు.
కరీంనగర్: కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం 6 గ్యారంటీలను నాలుగు రోజుల్లో అమలు చేయాల్సిందేనని.. హామీలను అమలు చేయకపోతే వదిలి పెట్టమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. మంత్రుల కేబినెట్ మీటింగ్‌లో 6 గ్యారెంటీలకు ఆమోదం తెలిపి నిధులను విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అనవసరంగా తన గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. పార్లమెంట్ రికార్డులు చూసుకుంటే తాను పార్లమెంట్‌కు వెళ్లానో లేదో కేటీఆర్‌కు తెలుస్తుందని చెప్పారు. పార్లమెంట్‌కు వెళ్లకుండా తాగి పండుకున్న చరిత్ర కేసీఆర్‌దని చెప్పారు.
చీపురుతో బీఆర్ఎస్ (BRS) ను ఊడ్చేసినా సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు ఏం సాధించారని కరీంనగర్ ‘కదనభేరీ’ సభని నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. కరీంనగర్ సభ సాక్షిగా కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను బరాబర్ హిందుత్వం గురించి మాట్లాడతానని, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే బాబర్, ఔరంగజేబు గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. ప్రజల కోసం తాము పోరాడితే కాంగ్రెస్‌కు ఓటేయడం న్యాయమా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి