Home » Bapatla
బాపట్ల: వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కు ఘోర పరాభవం ఎదురైంది. ‘అంతా మా ఇష్టం.. మాకు ఎలక్షన్ కోడ్ వర్తించదు’ అన్న రీతిలో ప్రచారాన్ని నిర్వహించిన ఎంపీ సురేష్కు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదురైంది.
బాపట్ల జిల్లా: బల్లికురవలో ఓ పోలీస్ అధికారి రెచ్చిపోయాడు. ఓ వృద్ధిడిపై ఝులుం ప్రదర్శించాడు. శానంపూడి హనుమంతురావు అనే వృద్ధిడిపై బల్లికురవ ఎస్ఐ శివనాగిరెడ్డి దాడి చేశాడు. వృద్ధుడు బల్లికురవలో బడ్డీకొట్టు నడుపుకుంటున్నాడు. మద్యం అమ్ముతున్నాడని ఆరోపిస్తూ...
మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్ వేపై ఈ రోజు ఎయిర్ ఫోర్స్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. విపత్తుల సమయంలో వినియోగించేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల, సింగరాయకొండ వద్ద రెండు ఎమర్జెన్సీ రన్ వేలను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది.
గుంటూరు జిల్లా: తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగిన భర్త, భార్య, కుమార్తె. ఈ ఘటనలో భార్య నాగమణి మృతిచెందగా.. భర్త శివ శంకర్రావు , కుమార్తె హారిక. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జిల్లాలోని మేదరమెట్ల వైసీపీ(YSRCP) సిద్దం సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి సీఎం జగన్ రెడ్డి (CM Jagan) వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు వైసీపీ కార్యకర్తల యత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, మరొకరికి అస్వస్థతకు గురయ్యారు.
అమరావతి: వైసీపీ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పార్టీ సిద్ధం సభలకు భారీగా ప్రభుత్వ బస్సులను వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సర్కార్ పెద్దలు ఏకాంగా ఇప్పుడు మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు.
బాపట్ల జిల్లా: భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్దం సభలు నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద సిద్ధం నాల్గవ సభ నిర్వహించనున్నారు. ముందు జరిగిన మూడు సిద్ధం సభలు ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోలేదు.
బాపట్ల జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్చూరు నియోజక వర్గంలోని ఇంకొల్లులో మధ్నాహ్నం రా కదలి రా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్నాహ్నం 2.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా చంద్రబాబు బయలు దేరి 2.55 గంటలకు ఇంకొల్లు చేరుకుంటారు.
పీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) తెలుగుదేశం (TDP) నేతలపై దాడులకు తెగబడుతోంది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని అనుకున్నదే తడవుగా వైసీపీ రౌడీ మూకలు పలు కుయుక్తులకు పాల్పడుతున్నారు.
అమరావతి: ఈ నెల 17 వ తేదీన బాపట్ల పార్లమెంట్ పరిధిలో జరిగే ‘రా కదిలిరా’ సభకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే సభ నిలుపుదలకు కుట్ర పన్నారు. సభకు ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది.