Share News

Bapatla : ఆస్తి కోసం కన్నవారిని కడతేర్చాడు

ABN , Publish Date - Dec 15 , 2024 | 05:59 AM

ఆస్తి రాయాలని, పెన్షన్‌ డబ్బులు ఇవ్వాలని ఓ కొడుకు తన తల్లిదండ్రులను డిమాండ్‌ చేశాడు.

Bapatla : ఆస్తి కోసం కన్నవారిని కడతేర్చాడు

  • బాపట్ల మండలం అప్పికట్లలో దారుణం

బాపట్ల, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆస్తి రాయాలని, పెన్షన్‌ డబ్బులు ఇవ్వాలని ఓ కొడుకు తన తల్లిదండ్రులను డిమాండ్‌ చేశాడు. వారు ఇవ్వకపోవడంతో కన్నవారిని పచ్చడిబండతో కొట్టి చంపేశాడు. బాపట్ల మండలం, అప్పికట్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రూరల్‌ సీఐ బీ హరికృష్ణ మీడియాకు తెలిపారు. విజయభాస్కరరావు(74) విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఆయన, భార్య వెంకటసాయికుమారి(70)తో కలసి అప్పికట్ల గ్రామంలో ఉంటున్నారు. వీరికి గ్రామంలో మూడంతస్థుల భవనం, విజయవాడలో ఇల్లు, ప్లాటు, పొలాలు ఉన్నాయి. ఆ ఆస్తులన్నీ తన పేరుతో రాయాలంటూ కొంతకాలంగా కుమారుడు కిరణ్‌ చంద్ర వారిని వేధిస్తున్నాడు. శనివారం తెల్లవారుజాము సుమారు 1.30 గంటల సమయంలో నిద్రపోతున్న తల్లిదండ్రులిద్దరినీ పచ్చడిబండతో దారుణంగా కొట్టి చంపాడు. మృతుల కుమార్తె లోకకల్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 15 , 2024 | 05:59 AM