Andhra Pradesh: మందేసి.. చిందేసి.. ఎమ్మెల్యే రచ్చ రచ్చ..!
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:26 PM
Bapatla News: ప్రభుత్వ కార్యక్రమాల్లో మనం ప్రొటోకాల్ చూసుంటాం.. ఎందుకంటే రాజ్యంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారికి దక్కే గౌరవం అది. కానీ ఏకంగా ఓ నేత పుట్టిన రోజు వేడుకల్లో షాంపైన్ పొంగించడానికి..
బాపట్ల, డిసెంబర్ 17: ప్రభుత్వ కార్యక్రమాల్లో మనం ప్రొటోకాల్ చూసుంటాం.. ఎందుకంటే రాజ్యంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారికి దక్కే గౌరవం అది. కానీ ఏకంగా ఓ నేత పుట్టిన రోజు వేడుకల్లో షాంపైన్ పొంగించడానికి ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ గుర్తుచేసి దానిని ఓపెన్ చేసే మహద్భాగ్యం సదరు నేతకు కల్పించడం, మందేసి లిండేయడం వీటన్నింటికీ బాపట్లలోని పాండురంగాపురం బీచ్ వేదికగా నిలిచింది. ఈ నెల 11న బాపట్లకు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టిన రోజు కావడంతో, పదో తేదీ అర్ధరాత్రి నుంచే పాండురంగాపురం బీచ్ వేదికగా వేడుకలకు తెర తీశారు.
బాపపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత అనంత వర్మతో పాటు పలువురు నేతలు, అనుచరులు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. వేడుకల్లో ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ మందు గ్లాసు చేతిలో పట్టుకుని చిందేసిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో పాటు వారి మధ్య జరిగిన సంభాషణలు కూడా ప్రజల్లో చర్చకు దారి తీశాయి. వేడుకల్లో భాగంగా షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసే క్రమంలో అన్నీ ఆయనే ఓపెన్ చేయాలా అని ఒకరంటే.. ప్రొటోకాల్ అని వైసీపీ నేత అనంతవర్మ అనడం, సదరు బాటిల్‌ను ఎమ్మెల్యే నరేంద్రవర్మే ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పుట్టిన రోజు వేడుకలు జరిగి వారం గడిచాక అక్కడ అంతర్గతంగా జరిగిన వీడియోలు బయటకు రావడం వెనక అక్కడ వేడుకల్లో పాల్గొన్న వారే కావాలనే వీటిని బయటకు విడుదల చేశారనే అనుమానాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు.
సాధారణమే కానీ..
ప్రైవేటు కార్యక్రమంగా జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో మందేయడం, చిందేయడం, మ్యూజికల్ నైట్ ఇవన్నీ కూడా సర్వ సాధారణమే. కానీ ఆ వేడుకల్లో పాల్గొన్నది ప్రస్తుతం టీడీపీ తరపున బాపట్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కావడంతో ఆ మందు, విందులపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
Also Read:
సొంత అడ్డాలో సీన్ రివర్స్.. జగన్‌లో గుబులు
జోగి రమేష్ వివాదంపై మంత్రి పార్థసారథి ఏమన్నారంటే..
For More Andhra Pradesh News and Telugu News