Home » BCCI
ఐపీఎల్ 17వ సీజన్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. గత ఏడాది కొచ్చి వేదికగా ఐపీఎల్ వేలం నిర్వహించిన బీసీసీఐ.. వచ్చే ఏడాదికి సంబంధించిన లీగ్ కోసం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా వేలం నిర్వహించనుంది.
బీసీసీఐ, బుక్‌మైషో కలిసి టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాయని పలువురు అభిమానులు ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని ఓ అభిమాని ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు.
వాతావరణ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై, ఢిల్లీలో జరిగే మ్యాచ్‌లలో బాణసంచా కాల్చడంపై బీసీసీఐ నిషేధం విధించింది.
ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ విరామంలో నైట్ క్లబ్ తరహాలో లైట్ షోలు ఏర్పాటు చేయడం చెత్త నిర్ణయమని మండిపడ్డాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం ఈ సారి దుబాయ్‌లో జరిగే అవకాశాలున్నాయి. వేలానికి సంబంధించిన వేదిక విషయంలో దుబాయ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ (BCCI) గుడ్ న్యూస్ అందించింది. వైజాగ్‌లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాదిలో మూడోసారి ACA-VDCA స్టేడియం ఆదిత్యం ఇవ్వనున్నది. వచ్చే నెల 23వ తేదీన ఇండియా- ఆస్ట్రేలియాల ( India- Australia Match ) మధ్య జరగనున్న మొదటి టీ–20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
భారత్ వేదికగా క్రికెట్ సంరంభం ‘క్రికెట్ వరల్డ్ కప్ 2023’ (Cricket World Cup 2023) మొదలైంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లంగ్పై న్యూజిలాండ్ గెలిచి శుభారంభం చేసింది. ఇక ఆతిథ్య భారత్ అక్టోబర్ 8న చెన్నై వేదికగా తొలి పోరులో ఆస్ట్రేలియాతో తలపడబోతోంది.
వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడడానికి మైదానాలకు వచ్చే ప్రేక్షకులకు బీసీసీఐ కార్యదర్శి జైషా శుభవార్త చెప్పారు. స్టేడియంలో ప్రేక్షకులకు ఉచితంగా తాగు నీరు అందివ్వనున్నట్లు పేర్కొన్నారు.
క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023కు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లోనే ప్రపంచకప్ ప్రారంభంకాబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ మైదానం వేదికగా ప్రపంచకప్ ఆరంభం కానుంది.
ప్రముఖ క్రికెట్ కోచ్, హైదరాబాద్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ బేగ్ సార్ ఇక లేరు. 84 ఏళ్ల బేగ్ సార్ ఛాతీ నొప్పితో గత రాత్రి తుది శ్వాస విడిచారు.