IPL 2024: దుబాయ్‌లో ఐపీఎల్ వేలం జరిగే అవకాశం.. ఎప్పుడంటే..?
ABN , First Publish Date - 2023-10-26T14:08:55+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం ఈ సారి దుబాయ్‌లో జరిగే అవకాశాలున్నాయి. వేలానికి సంబంధించిన వేదిక విషయంలో దుబాయ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలం ఈ సారి దుబాయ్‌లో జరిగే అవకాశాలున్నాయి. వేలానికి సంబంధించిన వేదిక విషయంలో దుబాయ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2024కు సంబంధించిన వేలాన్ని డిసెంబర్ 15 నుంచి 19 మధ్య నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఈ వారం రోజుల వ్యవధిలో డిసెంబర్ 18 లేదా 19 తేదీలలో వేలం ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ కన్నా ముందు మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలం జరిగే అవకాశాలున్నాయి. డబ్ల్యూపీఎల్ వేలంగా డిసెంబర్ 9 జరుగుతుందని భావిస్తున్నారు. దీనికి వేదిక ఖరారు కానప్పటికీ భారత్‌లోనే నిర్వహించే అవకాశాలున్నాయి. అయితే వేలానికి సంబంధించి ఇప్పటివరకు ఫాంచైజీలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. నిజానికి బీసీసీఐ గతేడాది వేలాన్ని ఇస్తాంబుల్‌లో నిర్వహించాలని భావించింది. కానీ చివరకు కేరళలోని కొచ్చిలో నిర్వహించింది. కాబట్టి ఈ సారి కూడా చివరి నిమిషంలో వేదికను మార్చిన అశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాగా వేలానికి ముందు ఫ్రాంచైజీలన్నీ ఈ సీజన్‌కు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లతోపాటు వదిలేసే ఆటగాళ్ల జాబితాను ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఓ షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఫ్రాంచైజీలన్నీ నడుచుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ సారి ఏఏ ఆటగాళ్లు వేలంలోకి వస్తారో తెలియాల్సి ఉంది.