Home » Bengaluru News
తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాట, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రైతుల జీవనాడి నిండుకుండలా తొణికిసలాడుతోంది. డ్యాం పైప్రాంతం నుంచి జలాశయంలోకి ఇన్ఫ్లో 80 వేలకు పైగా క్యూసెక్కులుగా నమోదయ్యింది.
తుంగభద్ర జలాశయానికి(Tungabhadra Reservoir) వరద పెరుగుతోంది. పై ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న తుంగ, భద్ర నదులు(Tunga and Bhadra rivers) ఉప్పొంగి తుంగభద్ర డ్యాంకు వరద ఉధృతి పెరుగుతోంది.
ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు విస్తరిస్తున్న బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP))ను పాలనా సౌలభ్యాల కోసం విభజించాలనే ప్రక్రియకు తుదిరూపు దిద్దారు. గతంలో 3 లేదా 5 భాగాలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఏకంగా మూడు విడతల పాలనా వ్యవస్థ, గరిష్టంగా 10 పాలికెలను అనుసంధానం చేసుకుని గ్రేటర్ బెంగళూరు పాలనా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
వారాణసిలో గంగా హారతి తరహాలోనే కావేరి నదికి కావేరి హారతి నిర్వహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) తెలిపారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకాలోని కేఆర్ఎస్ జలాశయాన్ని డీకే సందర్శించారు.
తుంగభద్ర(Tungabhadra)కు వరదపోటు ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం జలాశయానికి చెందిన 15,16,17 క్రస్ట్గేట్ల గుండా 4వేల కూసెక్కుల నీటిని నదికి వదిలారు.
కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో ఉద్యోగాల రిజర్వేషన్ అంశానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఫోన్ పే సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ సమీర్ నిగమ్ క్షమాపణ చెప్పారు.
తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir)లోకి రోజురోజుకు ఇన్ఫ్లో ఎక్కువై నిండుకుండలా మారుతోంది. జలాశయంలో అత్యధిక ఇన్ఫ్లో వుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 1,08,326 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బెంగళూరు నగరంలోని జీటీ వరల్డ్ మాల్లో సినిమా చూసేందుకు వచ్చిన రైతుకు అవమానం జరిగింది. పంచె కట్టుతో వచ్చాడని ఆ రైతుని సిబ్బంది లోనికి వెళ్లకుండా అడ్డుకోవడం వివాదానికి దారితీసింది.
కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నిర్ణయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, దిగ్గజ టెక్ సంస్థల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసింది.
‘నా కొడుకు తప్పు చేసి ఉంటే ఉరి తీయండి’... అంటూ శాసనసభలో మాజీ మంత్రి, జేడీఎస్ నేత రేవణ్ణ(Former minister and JDS leader Revanna) విరుచుకుపడ్డారు. ప్రతిపక్షనేత అశోక్ వాల్మీకి కార్పొరేషన్కు సంబంధించిన అవినీతి కేసును విచారిస్తున్న సిట్ అధికారుల తీరుకు, ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) కేసులో సిట్ ప్రవర్తించిన విధానాన్ని పోల్చారు.