Home » Bengaluru
ఉద్యోగం సంపాదించడం అంత తేలిక కాదు. రెజ్యూమ్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంతో పాటు ఇంటర్వ్యూలో సరైన సమాధానాలు చెబితేనే ఉద్యోగం వస్తుంది. రెజ్యూమ్‌లో అభ్యర్థులు తమ అర్హతలను, పనితీరను వివరిస్తారు. తాము ఆ ఉద్యోగానికి ఎలా సరిపోతామో, ఆ ఉద్యోగం తమకు ఎందుకు అవసరమో వీలైనంత వివరంగా పేర్కొంటారు.
నటుడు దర్శన్‌పై నమోదైన హత్యకేసు విచారణలో పలు విషయాలు బహిర్గతమవుతున్నాయి. బహచిత్రదుర్గ నివాసి రేణుకాస్వామిని హత్య చేసి, ఆ నేరాన్ని ఒప్పుకునేందుకు నలుగురు యువకులకు రూ.30లక్షలు ఇచ్చేలా డీల్ కుదిరినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కస్టడీలో ఉన్న ప్రముఖ సినీ నటుడు దర్శన్(Film actor Darshan) సహా నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో పలు కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ బెంగాల్‌కు వచ్చినప్పుడల్లా అక్కడ పలువురు మహిళలతో శారీరకంగా గడిపేవారని పశ్చిమ బెంగాల్‌కే చెందిన శంతను సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. శృంగార కార్యకలాపాల కోసం ఆయన బెంగాల్‌లోని బీజేపీ కార్యాలయాలను కూడా ఉపయోగించుకున్నారని ఫేస్బుక్లో పోస్టు చేశారు.
సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్1లోని రెండు పరికరాలు ఉగ్ర సూరీడు చిత్రాలను బంధించాయని ఇస్రో తెలిపింది. భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను ఇస్రో గతేడాది సెప్టెంబరు 2న ప్రయోగించింది.
అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టైన జేడీఎస్ నేత, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)కు బెంగళూరు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody) విధించింది. జూన్ 24 వరకూ కస్టడీ విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది.
బెంగళూరు నగరంలో వర్షాలు సాధారణమే. ఏడాదిలో ఏడెనిమిది నెలలపాటు ఇక్కడ వర్షం కురుస్తుంది. అయితే, జూన్ ఆరంభంలోనే ఆదివారం ఒకే రోజు ఏకంగా 110.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 133 ఏళ్ల నాటి రికార్డును బద్ధలు కొట్టింది.
భారీ వర్షంతో బెంగుళూరు మహానగరం తడిసి ముద్దయింది. బెంగుళూరులో ఆదివారం ఒకే రోజు 111.1 మి.మి వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. 133 ఏళ్ల క్రితం బెంగుళూరులో ఒకే రోజు 101.6 మి.మి వర్షపాతం నమోదై.. రికార్డు సృష్టించిందని తెలిపారు.
కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ కు కర్ణాటక స్థానిక కోర్టులో చుక్కెదురైంది. ఆ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది.
రాసలీలల వీడియో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండెడ్ జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు ఆరు రోజుల సిట్ కస్టడీకి ఆదేశించింది. 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని విచారణ సందర్భంగా కోర్టును ఇంతకుముందు సిట్ కోరింది.