Share News

Snake: అమెజాన్ ఆర్డర్‌ ఓపెన్ చేసిన భార్యభర్తలకు షాక్.. బుసలు కొట్టిన పాము

ABN , Publish Date - Jun 19 , 2024 | 07:40 AM

బెంగళూర్‌కు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. మంగళవారం వచ్చింది. ఎందుకైనా మంచిదని ఆర్డర్ తీసే సమయంలో వీడియో తీశారు. ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరో వస్తువు వస్తున్నాయి. జాగ్రత్త పడి వీడియో తీశారు. బాక్స్‌కు ఉన్న టేప్ తీసే క్రమంలో పామును గుర్తించారు.

Snake: అమెజాన్ ఆర్డర్‌ ఓపెన్ చేసిన భార్యభర్తలకు షాక్.. బుసలు కొట్టిన పాము
snake in order

ఏబీఎన్ ఇంటర్నెట్: ఆన్‌లైన్‌ ఆర్డర్ అంటే జనాలు భయపడిపోతున్నారు. ఇటీవల ఓ ముంబై వ్యక్తికి ఐస్‌క్రీమ్‌లో వేలు, మరో చోట జెర్రి కనిపించాయి. ఇప్పుడు అమెజాన్‌ పార్సిల్‌లో ఏకంగా పాము వచ్చింది. ఆ నాగుపామును (Snake) చూసి జంట ఖంగుతింది. బెంగళూరు జంటకు ఈ అనూహ్య అనుభవం ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను తమ సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన జంట వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమకు ఎదురైన వింత అనుభవాన్ని పంచుకున్నారు.


ఆర్డర్..

బెంగళూర్‌కు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. మంగళవారం వచ్చింది. ఎందుకైనా మంచిదని ఆర్డర్ తీసే సమయంలో వీడియో తీశారు. ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరో వస్తువు వస్తున్నాయి. జాగ్రత్త పడి వీడియో తీశారు. బాక్స్‌కు ఉన్న టేప్ తీసే క్రమంలో పామును గుర్తించారు. నాగుపాము కావడంతో భయాందోళనకు గురయ్యారు.


టేపుకు అతుక్కొని

నాగుపాము టేపుకు అతుక్కొని ఉంది. దీంతో ఆ జంట ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని వాపోయారు. వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్ సపోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. తమ పరిస్థితి చెప్పినప్పటికీ రెండు గంటలపాటు వెయిట్ చేయించారని మండిపడ్డారు. తర్వాత ఆర్డర్‌కు సంబంధించి నగదు మొత్తం రీఫండ్ చేశారు. ప్రమాదకర పాము రావడం ఆందోళన కలిగించింది. తమ భద్రత సంగతి ఏంటని అడిగారు.


భద్రత ప్రమాణాలు లేవా..?

వస్తువుల నిల్వ చోట సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదా..? సరైన రవాణా జరగడం లేదా..? అని ఆ జంట మండిపడ్డారు. ఈ ఘటనపై అమెజాన్ స్పందించింది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఆ ఆర్డర్‌కి సంబంధించి అసలు ఏం జరిగిందో పర్యవేక్షిస్తున్నామని ప్రకటన చేసింది.

మరిన్ని వార్తలు చదవండి.


Viral video: సంబరంగా ఈత కొడుతుండగా సడన్‌గా స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకిన పులి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

Updated Date - Jun 19 , 2024 | 11:16 AM