Hyderabad: చదువు కోసం బెంగళూరుకు వెళ్లి.. డ్రగ్స్ స్మగ్లర్‌గా మారిన యువకుడు
ABN , Publish Date - Jun 23 , 2024 | 10:37 AM
ఉన్నత చదువులకోసం బెంగళూరు(Bangalore)కు వెళ్లిన యువకుడు.. అక్కడ డ్రగ్స్‌కు అలవాటుపడి దానినే వ్యాపారంగా మార్చుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో కస్టమర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. డ్రగ్స్ స్మగ్లర్‌ను, మరో నలుగురు వినియోగదారులను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా శనివారం పట్టుకున్నారు.
- ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు సరఫరా
- నిఘాపెట్టి పట్టుకున్న టీన్యాబ్, మాదాపూర్ పోలీసులు
- స్మగ్లర్ సహా.. నలుగురు వినియోగదారులు అరెస్టు
హైదరాబాద్ సిటీ: ఉన్నత చదువులకోసం బెంగళూరు(Bangalore)కు వెళ్లిన యువకుడు.. అక్కడ డ్రగ్స్‌కు అలవాటుపడి దానినే వ్యాపారంగా మార్చుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో కస్టమర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. డ్రగ్స్ స్మగ్లర్‌ను, మరో నలుగురు వినియోగదారులను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా శనివారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.50 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన వెంకట సాయిచరణ్ గ్రాడ్యుయేషన్ చదువు కోసం బెంగళూరుకు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. చదువు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తన స్నేహితుల ద్వారా కొంతమంది డ్రగ్స్ వినియోగదారులను ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్(Nellore, Vijayawada, Rajahmundry, Vizag, Hyderabad) సహా పలు ప్రాంతాల్లోని కస్టమర్స్‌కు ఎండీఎంఏ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు.
ఇదికూడా చదవండి: మైనర్లు డ్రైవింగ్ చేస్తే.. వాహన యజమానులకు జైలే..
బెంగళూరు నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లకు పార్శిల్ కవర్లలో ఇచ్చి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. ఇటీవల నగరంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న నార్కోటిక్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ స్మగ్లర్స్, వినియోగదారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో సాయిచరణ్ సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్‌లో కస్టమర్స్‌కు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో మాదాపూర్, నార్కోటిక్ బ్యూరో పోలీసులు సంయుక్తంగా దాడిచేసి సాయిచరణ్‌తో పాటు.. నలుగురు వినియోగదారులు మల్లిక్‌లోకేష్, సందీప్‌రెడ్డి, రాహుల్, సుబ్రమణ్యంలను అదుపులోకి తీసుకున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News