దర్శన్.. పవిత్రను పెళ్లి చేసుకోలేదు
ABN , Publish Date - Jun 17 , 2024 | 06:10 AM
కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రగౌడ్‌ను పెళ్లి చేసుకోలేదని దర్శన్ న్యాయవాది అనీల్‌బాబు స్పష్టం చేశారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ అధికారులు పవిత్రను దర్శన్ రెండో భార్యగా పేర్కొంటున్న నేపథ్యంలో
బెంగళూరు, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రగౌడ్‌ను పెళ్లి చేసుకోలేదని దర్శన్ న్యాయవాది అనీల్‌బాబు స్పష్టం చేశారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ అధికారులు పవిత్రను దర్శన్ రెండో భార్యగా పేర్కొంటున్న నేపథ్యంలో లాయర్ ఈ మేరకు వివరణ ఇచ్చారు. వారిద్దరు తోటి నటులు, స్నేహితులు మాత్రమేనన్నారు. వారు పెళ్లి చేసుకున్నట్టు నిరూపించే పత్రాలేమీ లేవని వివరించారు. పవిత్రను దర్శన్ భార్యగా మీడియాలో కొందరు చూపిస్తుండటం వల్ల దర్శన్ భార్య విజయలక్ష్మి చాలా బాధపడుతున్నారని, అవమానంతో ఆమె బయటికి కూడా రాలేకపోతున్నారని లాయర్ వాపోయారు.
రేణుకాస్వామి హత్యకేసులో తాజాగా పవిత్రగౌడ మేనేజర్ దేవరాజ్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రేణుకాస్వామిని హత్య చేసిన కారుషెడ్‌కు పవిత్రతోపాటు దేవరాజ్ కూడా వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు శనివారం రాత్రి దర్శన్, పవిత్రగౌడల నివాసాలకు వెళ్లి పంచనామా చేశారు. రేణుకాస్వామిని పవిత్రగౌడ చెప్పుతో కొట్టినట్టు నిర్ధారించుకుని ఆ చెప్పులను కూడా స్వాధీనం చేసుకున్నారు.