Home » Bengaluru
చికిత్స నిమిత్తం మంగళూరు ఆసుపత్రికి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కేరళకు చెందిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
మహిళలపై లైంగిక దాడికి పాల్పడటం, అశ్లీల వీడియోలను రికార్డు చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ..
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. కోర్టులో ప్రజ్వల్ పేరుతో ఆయన తరఫు న్యాయవాది అరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.
సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ 2016లో బెల్జియంలో మరణించడంపై హెచ్డీ కుమారస్వామి ప్రశ్నించారు. అప్పుడు సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ఎందుకు రాకేష్ మృతిపై దర్యాప్తునకు ఆదేశించలేదని నిలదీశారు.
బెంగళూర్ రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీలో సినీ సెలబ్రిటీలు, ఇతరులు పాల్గొన్నారు. పార్టీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న వాహనం ఉంది. మంత్రి, అతని సంబందీకులు ఎవరూ పార్టీలో పాల్గొనలేదని ప్రాథమిక సమాచారం.
బెంగళూరు(Bangalore) అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఒకప్పుడు ఉద్యాననగరిగా, ఐటీ నగరిగా, ప్రస్తుతం స్టార్టప్‌లకు హబ్‌గా అంతర్జాతీయస్థాయిలో పేరుంది. నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయి.
బెంగళూరుకు చెందిన ఓ మహిళా టెకీ తాజాగా సైబర్ నేరగాళ్ల బారిన పడింది. వారు మాటలు నిజమని భయపడి ఏకంగా రూ. కోటి రూపాయలు నష్టపోయింది.
బెంగళూర్‌లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. లేదు, నేను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ కాకమ్మ కబుర్లు చెప్పింది. వీడియోలు రిలీజ్ చేసి తర పరువును తానే తీసుకుంది. రేవ్ పార్టీలో తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని తెలిసింది. బెంగళూర్ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని చెప్పేందుకు మరో కచ్చితమైన ఆధారం లభించింది.
నగర శివారులో నిర్వహించిన రేవ్ పార్టీకి సంబంధించిన సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ సంచలన విషయాలు వెల్లడించారు. మంగళవారం ఇదే విషయమై ప్రెస్‌మీట్ నిర్వహించిన సీపీ.. సన్ సెట్ టు సన్‌రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని తెలిపారు. రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని వెల్లడించారు. రేవ్ పార్టీపై సీసీబీ పోలీసులు దాడి చేశారని.. ఈ పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయని సీపీ తెలిపారు.
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. వారిలో పలువురు సీరియల్ నటులు, మోడల్స్ ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఓ ఫాంహౌ్‌సలో ఈ రేవ్ పార్టీ నిర్వహించారు.