Share News

Prajwal Revanna case: బెల్జియంలో మీ కుమారుడు చనిపోతే ఏం చేశారు? సీఎంను నిలదీసిన కుమారస్వామి

ABN , Publish Date - May 25 , 2024 | 07:14 PM

సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ 2016లో బెల్జియంలో మరణించడంపై హెచ్‌డీ కుమారస్వామి ప్రశ్నించారు. అప్పుడు సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ఎందుకు రాకేష్ మృతిపై దర్యాప్తునకు ఆదేశించలేదని నిలదీశారు.

Prajwal Revanna case: బెల్జియంలో మీ కుమారుడు చనిపోతే ఏం చేశారు? సీఎంను నిలదీసిన కుమారస్వామి

బెంగళూరు: ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వీడియోలు వెలుగు చూడటం, ఆయన విదేశాలకు పారిపోవడం సంచలన సృష్టించగా, ఈ వివాదం చుట్టూ నేతల మాటల తూటలు పేలుతున్నాయి. కొత్త ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడనే స్వయంగా తన మనుమడు రేవణ్ణను విదేశాలకు పంపించారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం చేసిన ఆరోపణలపై తాజాగా రేవణ్ణ అంకుల్ జేడీ హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) మండిపడ్డారు. సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ (Rakesh) 2016లో బెల్జియంలో మరణించడంపై ప్రశ్నించారు. అప్పుడు సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ఎందుకు రాకేష్ మృతిపై దర్యాప్తునకు ఆదేశించలేదని నిలదీశారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో రాకేష్ చనిపోయారని చెప్పారు.


రాకేష్ మృతిని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఏ ఈవెంట్ కోసం రాకేష్ విదేశాలకు వెళ్లాడో చెప్పాలని కుమారస్వామి ప్రశ్నించారు. రాకేష్ తన తండ్రి అనుమతి తీసుకునే బెల్జియం వెళ్లారా అనేది కూడా సిద్ధరామయ్య వెల్లడించాలన్నారు. ఫారెన్‌లో రాకేష్ మృతిచెందినప్పుడు ఆయన వెంట ఎవరున్నరో చెప్పాలన్నారు.. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలతో తమ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కుమారస్వామి ఆరోపించారు.

Modi Mujra remarks row: మోదీ 'ముజ్రా' వ్యాఖ్యలు.. పీఎం కోలుకోవాలంటూ విపక్షం కౌంటర్


నా కొడుకు చావుకు, ఒక రేపిస్ట్ కేసుకూ పోలికా?: సిద్ధరామయ్య

కుమారస్వామి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వేగంగా స్పందించారు. తన కుమారుడు మృతికి, ప్రజ్వల్ రేవణ్ణ కేసుకు అసలు సంబంధమే లేదని అన్నారు. కుమారస్వామి మేనల్లుడు ఒక 'రేపిస్ట్' అని మండిపడ్డారు. ప్రజ్వల్ హత్యాచారం కేసు కంటే తన కుమారుడు మృతి కేసే పెద్దదిగా మాట్లాడటం ఏమిటని నిలదీశారు. రాకేష్ మృతి ఐపీసీ లేదా క్రిమినల్ చట్టంలోని ఏ సెక్షన్ కింద నేరమో చెప్పాలన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత రాకేష్ మృతి అంశాన్ని లేవనత్తడం కంటే బుద్ధితక్కువతనం మరొకటి ఉండదని కుమారస్వామిపై విరుచుకుపడ్డారు.

Read National News and Latest News here

Updated Date - May 25 , 2024 | 07:18 PM