Home » Bharat Jodo
విపక్ష 'ఇండియా' బ్లాక్ కన్వీనర్‌గా ఎవరిని నియమించనున్నారు? దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తడుముకోకుండా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై శనివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో కూటమి కన్వీనర్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు....'ఇది కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రశ్న' అంటూ ఆయన చమత్కరించారు.
నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానెళ్లు, యాంకర్లు, టీవీ షోలను బహిష్కరించాలని నిర్ణయించింది.
ఒకే ఒక్కడు.. భారతదేశంలో మునుపెన్నడూ ఎవరూ చేయని అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశాడు..! కన్యాకుమారి నుంచి జమ్మూ కశ్మీరు వరకు 4వేల కిలోమీటర్ల ‘భారత్ జోడో యాత్ర’ను (Bharat Jodo Yatra) చేపట్టాడు.! బహుశా ఇన్నివేల కిలోమీటర్లు అదికూడా దేశ వ్యాప్తంగా యాత్ర చేసిన మొదటి వ్యక్తి యువనేత రాహుల్ గాంధీయేనేమో (Rahul Gandhi)!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ జరిపిన 'భారత జోడో యాత్ర' ఏడాది పూర్తికావస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ 'భారత్ జోడో యాత్ర'ను నిర్వహించనుంది.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత ఏడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో భారత్ జోడో యాత్ర ఫేజ్-2కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ యాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి ప్రారంభమై మేఘాలయతో ముగియనుంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్ర చేయబోతున్నారు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఇంకా ఖరారు కాలేదు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), జైరామ్ రమేశ్ (Jairam Ramesh), సుప్రియ శ్రినాటే (Supriya Shrinate) చిక్కుల్లో పడ్డారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా కేజీఎఫ్-2 సినిమాలోని సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించుకున్నట్లు వీరిపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
ఐక్యతా సందేశంతో తాను భారతదేశంలో జరిపిన "భారత్ జోడో యాత్ర''ను అడ్డుకునేందుకు నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో లో భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసిన ''మొహబ్బత్ కి దుకాన్'' కార్యక్రమంలో రాహుల్ బుధవారంనాడు ప్రసంగించారు.
బీజేపీ విద్వేష రాజకీయాలకు నిరసనగా, ప్రజల్లో శాంతిసామరస్యాలను నెలకొల్పేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన..
జైపూర్: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దోహదం చేసిందని అన్నారు. రాబోయే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రజలే వారికి (బీజేపీ) తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.