Rahul Gandhi : కాపీరైట్ వివాదం.. రాహుల్ గాంధీకి కర్ణాటక హైకోర్ట్ షాక్..
ABN , First Publish Date - 2023-06-29T11:08:17+05:30 IST
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), జైరామ్ రమేశ్ (Jairam Ramesh), సుప్రియ శ్రినాటే (Supriya Shrinate) చిక్కుల్లో పడ్డారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా కేజీఎఫ్-2 సినిమాలోని సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించుకున్నట్లు వీరిపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
బెంగళూరు : కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), జైరామ్ రమేశ్ (Jairam Ramesh), సుప్రియ శ్రినాటే (Supriya Shrinate) చిక్కుల్లో పడ్డారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా కేజీఎఫ్-2 సినిమాలోని సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించుకున్నట్లు వీరిపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. అనుమతి లేకుండా సోర్స్ కోడ్‌ను ట్యాంపర్ చేసినట్లు కనిపిస్తోందని, ఇది నిస్సందేహంగా కంపెనీ కాపీరైట్‌ను ఉల్లంఘించడమవుతుందని తెలిపింది.
రాహుల్ గాంధీ 2022లో భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కన్నడ సినిమా కేజీఎఫ్-2లోని మ్యూజిక్‌ను అనధికారికంగా వాడుకున్నారని ఎంఆర్‌టీ మ్యూజిక్ ఫిర్యాదు చేసింది. ఈ సినిమాలోని పాటలతో రెండు వీడియోలను కాంగ్రెస్ విడుదల చేసిందని, దీనికి తమ అనుమతి లేదని తెలిపింది. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి, ఈ పాటల మ్యూజిక్‌ను కాంగ్రెస్ పార్టీ వాడుకుందని ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా రాహుల్ గాంధీ తదితరులపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాపీరైట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాలు, భారత శిక్షా స్మృతి ప్రకారం యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.
భారత్ జోడో యాత్ర 2022 సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారి నుంచి ప్రారంభమైంది. దాదాపు 145 రోజులపాటు జరిగిన ఈ యాత్ర కశ్మీరులో ముగిసింది. రాహుల్ సుమారు 4 వేల కిలోమీటర్లు నడిచి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో మోటారు సైకిల్ మెకానిక్ దుకాణాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నారు. ఈ ఫొటోలను ఆయన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి :
Obama Vs Modi : బరాక్ ఒబామా ఓ ప్రైవేట్ వ్యక్తి : అమెరికా
Eid al-Adha : ఈద్ అల్-అదా పండుగ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు