Home » Bhatti Vikramarka Mallu
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం.. చేయగలిగేదే చెప్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండల సీతారాంపురం సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... తనను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని.. సీతారపురం గ్రామస్థులు చల్లగా ఉండాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని.. పనుల విషయంలో అధికారులు పర్యవేక్షణ తప్పని సరి అని అన్నారు.
గత కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. కోల్ బ్లాక్ ఆక్షన్లో పాల్గొనకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి నష్టం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోల్ బ్లాక్ ఆక్షన్లో తప్పకుండా పాల్గొంటుందని తెలిపారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka ) అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
లోక్సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. కొత్త నోటిఫికేషన్లకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తోంది. వారం రోజుల్లో 11 వేల పోస్ట్లతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయనుంది.
Good News For Telangana Womens: కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు (6 Guarantees) ఏ విధంగా తోడ్పడ్డాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే.. ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర హామీలను సైతం అమలు చేయడానికి రేవంత్ సర్కార్ (Revanth Sarkar) సాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు కీలక హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా సంచలన ప్రకటన చేసింది. భద్రాద్రి శ్రీరాముడి సన్నిధిలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు..
ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi)తో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
పోరాట యోధుల స్ఫూర్తితో పరిపాలన సాగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు.
రాముడి పేరిట రాజకీయాలొద్దని.. రాముడు అందరికీ దేవుడు... తమకు కూడా దేవుడేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) అన్నారు. మత విభజన పేరిట వైశమ్యాలు సృష్టించొద్దని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆరోపించారు. సోమవారం నాడు బాగ్ లింగంపల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం జరిగింది.
టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించామని.. త్వరలోనే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు.