Share News

Bhatti Vikramarka: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేదు

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:53 PM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆరోపించారు. సోమవారం నాడు బాగ్ లింగంపల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం జరిగింది.

Bhatti Vikramarka: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేదు

హైదరాబాద్ (ముషీరాబాద్): గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పరిశ్రమను ఏర్పాటు చేయలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆరోపించారు. సోమవారం నాడు బాగ్ లింగం పల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు వాజీ హుస్సేన్, కల్పన యాదవ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.... విద్య, వైద్యాన్ని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని తెలిపారు‌. కాంగ్రెస్ ఆస్తులు, సంపద సృష్టిస్తే బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ కోసం ప్రతి కార్యకర్త కష్టపడతారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ముషీరాబాద్ .. చరిత్రాత్మక నియోజకవర్గమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం గర్వకారణమని చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చెసింది ఆనాటి కాంగ్రెస్ నాయకులేనని అన్నారు. కృష్ణ , గోదావరి నుంచి కాంగ్రెస్ నీళ్లు తెచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ హైదరాబాద్‌కు చుక్క నీళ్లు తెలేదని విమర్శించారు. చదువుకోవడానికి కళాశాలలు పెట్టి ఫీజు రియంబర్స్‌మెంట్‌ను కాంగ్రెస్ ఇచ్చిందన్నారు.హైటెక్ సిటీ కంప్యూటర్ రంగాన్ని మొదట కాంగ్రెస్ తెచ్చిందని గుర్తుచేశారు. ఇక్కడ పరిశ్రమలు రావడానికి కారణం ఆనాటి కాంగ్రెస్ నాయకులేనని భట్టి విక్రమార్క తెలిపారు.

Updated Date - Jan 29 , 2024 | 06:11 PM