Revanth Govt: భట్టీ కీలక ప్రకటన.. మహిళలకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్
ABN , Publish Date - Feb 18 , 2024 | 06:52 PM
Good News For Telangana Womens: కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు (6 Guarantees) ఏ విధంగా తోడ్పడ్డాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే.. ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర హామీలను సైతం అమలు చేయడానికి రేవంత్ సర్కార్ (Revanth Sarkar) సాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు కీలక హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా సంచలన ప్రకటన చేసింది. భద్రాద్రి శ్రీరాముడి సన్నిధిలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు..
కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు (6 Guarantees) ఏ విధంగా తోడ్పడ్డాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే.. ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర హామీలను సైతం అమలు చేయడానికి రేవంత్ సర్కార్ (Revanth Sarkar) సాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు కీలక హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా సంచలన ప్రకటన చేసింది. భద్రాద్రి శ్రీరాముడి సన్నిధిలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన తెలంగాణ మహిళలకు (Telangana Womens) సంబంధించినదే.
అదిరిపోయిందిగా..!
త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు(Vaddi Leni Runalu Scheme) ఇస్తామని భట్టి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిలాగా చూసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్న మరోసారి ఆయన గుర్తు చేశారు. జీతాలు సకాలంలో అందని ఆశా వర్కర్లు. అంగన్‌వాడీ సిబ్బంది జీతాలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలతో ఇందిరమ్మ రాజ్యం పాలన సాగుతోందన్నారు. కాగా.. మహిళలకు ఇది నిజంగానే అదిరిపోయే శుభవార్తే అని చెప్పుకోవచ్చు. భద్రాద్రి రాముని సన్నిధిలో భట్టీ చేసిన ఈ కీలక ప్రకటనతో తెలంగాణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళా సంఘాల నేతలు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఎన్నికల ముందే ప్రకటన!
తెలంగాణలోత్వరలో పార్లమెంట్ ఎన్నికల జరగనున్నాయి. 17 పార్లమెంట్ స్థానాలున్న రాష్ట్రంలో 12 నుంచి 15 వరకు గెలవాలన్నదే కాంగ్రెస్ ప్రధాన టార్గెట్. ఇందుకోసం అధికార పార్టీ విశ్వప్రయత్నాలూ చేస్తోంది. ప్రతిపక్షాలకు ఊహకందని రీతిలో.. ఏ మాత్రం కాంగ్రెస్‌కు దరిదాపుల్లో రానివ్వకుండా ప్రభుత్వం ఇలా కీలక ప్రకటనలు చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలకు అన్నీ శుభవార్తలే చెబుతూ వస్తోంది సర్కార్. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సరిగ్గా నోటిఫికేషన్‌కు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రకటన చేసిందనే ఆరోపణలు బీఆర్ఎస్, బీజేపీల నుంచి వస్తున్నాయి. ఈ విమర్శలు, ఆరోపణలకు అధికార పార్టీ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి. ఇన్ని ప్రకటనలు, శుభవార్తలు చెబుతున్నా రేవంత్ సర్కార్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎన్ని సీట్లు కట్టబెడతారో చూడాలి మరి.
Siddam Sabha: రాప్తాడు ‘సిద్ధం’ సభలో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్!
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి