Home » Bhuvanagiri
ప్రతిభావంతులైన చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముగ్గురు కళాకారులను వరించింది.
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తోకతో పుట్టిన చిన్నారికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ సోమవారం ఉదయం సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు పాల్గొన్నారు.
భువనగిరి: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి చెంత ప్రతి నెల గిరిప్రదక్షిణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత నెల చేపట్టిన గిరిప్రదక్షిణలో ఊహించని రీతిలో 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమవారం ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొన్నారు.
ప్రయాణికులకు సేవలు విస్తరించడంతో పాటు గ్రేటర్(Greater) నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ అదనపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది.
ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణంలో ఒక్కో అడుగు ముందుకుపడుతోంది. రెండు నెలల్లో టెండర్లకు వెళ్లనుండగా.. అక్టోబరులో ఉత్తర భాగం పనులు మొదలుకానున్నాయి. నిర్మాణం ప్రారంభించేందుకు అనువుగా రహదారికి సాంకేతికంగా ఒక నంబరు (వర్కింగ్ టైటిల్) ఇవ్వాల్సి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణికుల కష్టాలు కొంతమేర తీరనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ రియల్ వ్యాపారం జోరు తగ్గలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచే అత్యధిక ఆదాయం సమకూరింది. ఈ జిల్లాల్లో డాక్యుమెంట్ల నమోదు కూడా ఎక్కువగానే ఉంటుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రిలో బుధవారం రాత్రి 20 నిమిషాల పాటు అంధకారం నెలకొంది. సెల్‌ఫోన్ టార్చ్ వెలుతురులోనే వైద్యులు రోగులకు చికిత్స అందించాల్సి వచ్చింది. వర్షాలతో ఆస్పత్రికి విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ సరఫరాను రాత్రి 9.30 గంటలకు నిలిపివేశారు.