Home » Bhuvanagiri
ఆధ్యాత్మికం, సాంస్కృతికంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతో ప్రసిద్ధి చెందిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.
భువనగిరి ఘటనలో వాస్తవాలను తెలుసుకోకుండా కేటీఆర్ ట్వీట్ చేయడం బాఽధ్యతారాహిత్యమని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ముదిరాజ్‌వాడ అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు కుళ్లిన కోడిగుడ్లు పంపిణి చేయడం దారుణమని, అధికారులు వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
పెచ్చులు ఊడుతున్న పైకప్పు.. శిథిలావస్థలో ఉన్న భవనాలు.. యాదాద్రి భువనగిరిజిల్లా భువనగిరిలోని గురుకుల పాఠశాల దుస్థితి ఇది! ఆ భవనాలు కూలే ప్రమాదం ఉందని.. విద్యార్థుల భద్రతకు ముప్పు పొంచి ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు.
ప్రతిభావంతులైన చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముగ్గురు కళాకారులను వరించింది.
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తోకతో పుట్టిన చిన్నారికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ సోమవారం ఉదయం సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు పాల్గొన్నారు.
భువనగిరి: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి చెంత ప్రతి నెల గిరిప్రదక్షిణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత నెల చేపట్టిన గిరిప్రదక్షిణలో ఊహించని రీతిలో 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమవారం ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొన్నారు.
ప్రయాణికులకు సేవలు విస్తరించడంతో పాటు గ్రేటర్(Greater) నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ అదనపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది.