Share News

District Legal Service Authority: విద్యార్థుల భద్రతకు పొంచి ఉన్న ముప్పు

ABN , Publish Date - Aug 14 , 2024 | 04:18 AM

పెచ్చులు ఊడుతున్న పైకప్పు.. శిథిలావస్థలో ఉన్న భవనాలు.. యాదాద్రి భువనగిరిజిల్లా భువనగిరిలోని గురుకుల పాఠశాల దుస్థితి ఇది! ఆ భవనాలు కూలే ప్రమాదం ఉందని.. విద్యార్థుల భద్రతకు ముప్పు పొంచి ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు.

District Legal Service Authority: విద్యార్థుల భద్రతకు పొంచి ఉన్న ముప్పు

  • భువనగిరి గురుకులనిర్వహణ, వసతులపై

  • జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అసంతృప్తి

  • ‘వసతి గృహ హింస’ కథనానికి స్పందన

భువనగిరి టౌన్‌, ఆగస్టు 13: పెచ్చులు ఊడుతున్న పైకప్పు.. శిథిలావస్థలో ఉన్న భవనాలు.. యాదాద్రి భువనగిరిజిల్లా భువనగిరిలోని గురుకుల పాఠశాల దుస్థితి ఇది! ఆ భవనాలు కూలే ప్రమాదం ఉందని.. విద్యార్థుల భద్రతకు ముప్పు పొంచి ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన ‘వసతి గృహ హింస’ కథనానికి స్పందనగా.. ఆ సంస్థ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి, ప్రధాన సీనియర్‌ సివిల్‌ జడ్జి వి.మాధవీలత, ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జి డి.నాగేశ్వరరావు మంగళవారం సాయంత్రం భువనగిరి గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు పెడుతున్న భోజన నాణ్యతను, పాఠశాల, డార్మెటరీ భవనాలను పరిశీలించారు. విద్యార్థులతో, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పిల్లలకు పెడుతున్న భోజనంలో నాణ్యత లోపించిందని, పరిశుభ్రత లేదని అసంతృప్తి వెలిబుచ్చారు. పాఠశాల ఆవరణలో పెరిగిన చెట్ల పొదల కారణంగా పాములు వచ్చే ప్రమాదం ఉందని.. శిథిలావస్థలో ఉన్న భవనాలు వర్షాలకు కూలే ముప్పు ఉందని ఆందోళన వెలిబుచ్చారు. వసతులు మెరుగుపరిచే దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని సంక్షేమ, విద్యా శాఖలకు, జిల్లా పాలనా యంత్రాంగానికి సూచించారు.

Updated Date - Aug 14 , 2024 | 04:18 AM