Home » BJP Candidates
గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ భారతీయుల కోసం నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపూరి అర్వింద్ అండ దండ.. గా నిలిచారని గల్ఫ్ ఐక్య వేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ బరిలో దిగుతున్న అర్వింద్‌ను మరోసారి గెలిపించి.. పార్లమెంట్‌కు పంపాలని ప్రవాసీయులకు, వారి కుటుంబాలకు గల్ఫ్ ఐక్య వేదిక విజ్జప్తి చేసింది.
Lok Sabha Polls 2024: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Raghul Gandhi) కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ఏప్రిల్ 26 తరువాత అమేథీలో(Amethi) పర్యటించాలని యోచిస్తున్నారని, నియోజకవర్గంలో కుల చిచ్చు రగిల్చే కుట్రకు తెరలేపుతున్నారని కేంద్ర మంత్రి..
Telangana BJP MP Candidates: లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ, ప్రధాన పార్టీల్లో ఇప్పటికీ టికెట్ల పంచాయితీ నడుస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 370 సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బీజేపీ(BJP).. ఆ సీట్ల లొల్లి ఇంకా కొలిక్కి రావడం లేదు. తాజాగా బీజేపీలో పెద్దపల్లి(Peddapalli) టికెట్‌కు సబంధించిన..
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణ కోసం కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కాసేపట్లో మొదలుకానుంది. అభ్యర్థులు ఒక్కొక్కరుగా తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయనున్నారు. ఈరోజు మంచి రోజు కావడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈరోజు ఉదయం విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం చిట్టినగర్‌లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక రేపటి (గురువారం) నుంచి నామినేషన్ల ఘట్టం కూడా మొదలుకానుంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటు తెలంగాణ బీజేపీ మాత్రం నామినేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి సరికొత్త రీతిలో నామినేషన్లను వేయించాలని బీజేపీ నిర్ణయించింది.
‘సీఎం జగన్ (CM JAGAN)... రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తీసుకొని రాలేదు. మరే ఇతర అభివృద్ధినీ చేపట్టలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి వనంగా మార్చగలిగారు. కొన్ని తరాల యువత నిర్వీర్యం కావటానికి, వారి జీవితాలు నాశనం కావటానికి మాత్రం బాటలు వేయగలిగారు. ఇటువంటి వ్యక్తి నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించాలి. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాం’ అని లోక్‌సత్తా పార్టీ ఏపీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు.
తనకు కేవలం లక్షన్నర రూపాయల కారు మాత్రమే ఉందని చెబుతున్న దయానిధి.. మరి చేతికి రూ.45 లక్షల విలువైన రోలెక్స్ వాచీ ఎలా ధరిస్తున్నారో చెప్పాలని సెంట్రల్ చెన్నై బీజేపీ అభ్యర్థి వినోజ్ పి.సెల్వం(BJP candidate Vinoj P. Selvam) ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో(Hyderabad) మూడు ఎంపీ సీట్లపై కమలం(BJP) పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి మూడు స్థానాలను కైవసం తీసుకునే దిశగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. ముగ్గురు అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో(Parliament Constituency) పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఒకసారి..
BJP 4th List: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ(BJP) స్పీడ్ పెంచింది. తమ పార్టీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటికే మూడు విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ.. ఇప్పుడు నాలుగో విడత(BJP 4th List) అభ్యర్థులను ప్రకటించింది. నాలుగో విడతలో 15 మంది ఎంపీ అభ్యర్థుల(MP Candidates) పేర్లను..
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP) తన అభ్యర్థుల మూడో జాబితాను(BJP Third List) విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు(Tamil Nadu) సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. ఇటీవల తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైని..