Home » BJP
పిడి గుద్దులు గుద్దుకుంటూ సభలో వాగ్వాదానికి దిగారు. అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే, ఇంజనీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370పై బ్యానర్‌ను ప్రదర్శించడంతో సభలో గందరగోళం మొదలైంది. ఆ తర్వాత, బ్యానర్ ప్రదర్శనపై ..
‘రాహుల్‌గాంధీ కులం ఏంటన్నది తెలియాలంటే దేశంలో కులగణన చేయండి. కులగణన పత్రంతో రాహుల్ ఇంటికి వెళితే.. తన కులమేదో ఆయనే చెబుతారు’ అంటూ బీజేపీ నేతలకు మంత్రి కొండా సురేఖ సలహా ఇచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులమో.. ఏ మతమో స్పష్టం చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తనది ఏ కులమో చెప్పకుండా కుల గణనకు బ్రాండ్ అంబాసిడర్లా రాహుల్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలోని నార్త్ మహారాష్ట్ర టౌన్ అయిన మాలేగావ్‌లో 2008 సెప్టెంబర్ 20న బాంబు పేలుడు ఘటన జరిగింది. మసీదుకు సమీపంలోని మోటార్ వాహనానికి అమర్చిన బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
వారంరోజుల క్రితం మండలంలోని బెంగాళీ క్యాంపునకు చెందిన ఏడుగురిపై అక్రమంగా కేసుపెట్టి చితకబాదిన అటవీశాఖ అధికారుల తీరును నిరసిస్తూ నిరాహారదీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. గతంలో సైతం అటవీశాఖ అధికారులు వన్యప్రాణులను చంపారన్న నెపంతో లక్షలు వసూలు చేసి కాగజ్‌నగర్ డీఎఫ్‌వోకు కట్టబెట్టారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
ఝార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం రాష్ట్రమంతటా బంగ్లాదేశ్ చొరబాటుదారులకు నివాసం కల్పిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. వారికి పాలక కూటమి జేఎంఎం-కాంగ్రె్స-ఆర్జేడీ పార్టీలు అండగా ఉన్నాయన్నారు.
బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తనకు ఇది రెండవ ర్యాలీయే అయినప్పటికీ రాష్ట్రంలో గెలుపుపై ఇప్పటికే నమ్మకం కలిగిందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని ప్రజలు ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న మూడు శాసనమండలి స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.