Home » Botcha Sathyanarayana
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీసీ గెలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 9 న విశాఖ వేదికగా జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అలా జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘‘ జున 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
సర్వేలను తాను నమ్మనని వైసీపీకి ఈ ఎన్నికల్లో 17కు 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి టార్గెట్ అదేనని.. ఆ టార్గెట్ కచ్చితంగా కొడతామని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.
Andhrapradesh: ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ఎటువంటి సందేహాలు వద్దని.. జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధమన్నారు. భూ హక్కు దారులకు ప్రయోజనం కలిగేలా యాక్ట్‌ను తీసుకువస్తున్నామని తెలిపారు. దళారి వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నామని చెప్పారు.
మొన్న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ రెడ్డి (CM Jagan) ని టార్గెట్ చేస్తూ ఒక షూటర్‌తో టీడీపీ నేతలు కొట్టించారని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆరోపించారు. సోమవారం నాడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు రాయితో జగన్‌ని కొట్టించడం, నిన్న గులక రాళ్లతో దాడి చేయించుకోవడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ యాక్టర్ కాదు, రియల్ ఫైటర్ అని కొనియాడారు.
వైసీపీ (YSRCP) చేపట్టిన ‘సిద్ధం’ సభలే తమకు ఆదరణ తీసుకువస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. సోమవారం నాడు మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ‘సిద్ధం’ సభలో జనాలు తక్కువగా ఉన్నారని.. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రాఫిక్స్‌ను ఎలా మార్ప్ చేశారో అలాగే అందరూ చేస్తారనుకోవడం తప్పని అన్నారు.
అధికార వైసీపీ (YSRCP)కి చెందిన వలంటీర్లు తన పార్టీకి మద్దతిస్తే వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం తన పార్టీ కార్యాలయంలో నిరుద్యోగులకు హామీ పత్రాలు ఇస్తానని ప్రకటించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ పెన్నుల్లోని ఇంకంతా అవినీతి సంతకాలకే సరిపోతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. గురువారం నాడు చీపురపల్లిలో శంఖారావం సభ నిర్వహించారు.
Andhrapradesh: ఏపీ రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీయడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది.
దుష్ట శక్తుల కుట్రలను తిప్పి కొడతామని మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana) హెచ్చరించారు. భీమిలి సంగీవలసలో ఈనెల 27వ తేదీన జరుగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం నాడు వైసీపీ నేతలు పరిశీలించారు.
Andhrapradesh: సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై విరుచుకుపడ్డారు.