AP Election 2024:సర్వేలను నేను నమ్మను... మాకు వచ్చే సీట్లు ఇవే..: మంత్రి బొత్స సత్యనారాయణ
ABN , Publish Date - May 11 , 2024 | 04:36 PM
సర్వేలను తాను నమ్మనని వైసీపీకి ఈ ఎన్నికల్లో 17కు 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి టార్గెట్ అదేనని.. ఆ టార్గెట్ కచ్చితంగా కొడతామని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.
విశాఖపట్నం: సర్వేలను తాను నమ్మనని వైసీపీ (YSRCP)కి ఈ ఎన్నికల్లో 17కు 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి టార్గెట్ అదేనని.. ఆ టార్గెట్ కచ్చితంగా కొడతామని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఎన్నికల కమిషన్ ద్వారా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తాను గెలిస్తే చాలని అనుకుంటున్నారని అన్నారు.
LokSabha Elections: ఆ విషయాన్ని ఏ పిచ్చి ముఖ్యమంత్రి చెప్పడు..
వైసీపీ కుటుంబ పార్టీ అయితే.. చంద్రబాబుది కుటుంబ పార్టీ కాదా? అని ప్రశ్నించారు.ప్రధాని మోదీని విమర్శించడానికి తన స్థాయి సరిపోదా? అని నిలదీశారు. ప్రతిపక్ష నేతలు సీఎం జగన్ గురించి మాట్లాడినప్పుడు తాను ప్రధాని గురించి మాట్లాడితే తప్పేంటి? అని నిలదీశారు. ఉద్యోగులకు మేలు చేసింది వైసీపీ ప్రభుత్వమేనని ఉద్ఘాటించారు.
AP Elections: సాంబ వర్సెస్ సత్య.. వైసీపీ కీలక నేతకు ఘోర అవమానం!
మోదీకి బొత్స ఝాన్సీ సవాల్
విశాఖ పరిపాలన రాజధాని అయితేనే ఉత్తరాంధ్రా అభివృద్ధి చెందుతుందని విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ తెలిపారు. తమకు పదవులు ముఖ్యం కాదు...స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణే ముఖ్యమని తెలిపారు. స్టీల్ ఫ్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రధాని మోదీ చెప్పాలని అడిగారు. మోదీ హామీ ఇస్తే తాను,అమర్నాథ్ పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. జగన్ ఒత్తిడి వల్లే స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ కాలేదని బొత్స ఝాన్సీ పేర్కొన్నారు.
AP Elections: వ్యాన్-లారీ ఢీ.. బయటపడిన అట్టపెట్టెలు.. ఓపెన్ చేయగా కళ్లు జిగేల్..!
Read Latest AP News And Telugu News